హీరోయిన్లను టార్చర్ పెడుతున్న స్నేహారెడ్డి?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. స్టార్ హీరో భార్య హీరోయిన్లకు తలనొప్పిలా మారారనేది ఆ వార్త సారాంశం. తెలుగు సినీ పరిశ్రమలో ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు. ఆయన విజయం వెనక భార్య స్నేహారెడ్డి కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని బన్నీ చాలా సందర్భాల్లో బహిరంగంగానే చెప్పారు. ప్రస్తుతం ఆమె ఫొటో షూట్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుంటుంది. తన అందంతో కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

వివాహమై ఇద్దరు పిల్లలున్నారంటే నమ్మడం కష్టమంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అచ్చం కాలేజీకి వెళ్లే అమ్మాయికలా కనిపిస్తోందంటున్నారు. చాలామంది హీరోయిన్ల కన్నా స్నేహారెడ్డి బాగుందని, సినిమాల్లోకి వస్తే బాగుంటందంటున్నారు. ఆమెను చూసి నేర్చుకోండంటూ హీరోయిన్లకు సలహానిస్తున్నారు. ఇలా మిగతా హీరోయిన్లకు పెద్ద తలనొప్పిలా మారిపోయింది. స్నేహ అందం చూసి కొందరు అసూయ పడుతుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు.

telugu star hero allu arjun wife turns big headache for heroines

అల్లు అర్జున్, స్నేహ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. వారి ఆలనా పాలనా వీరిద్దరూ దగ్గరుండి చూసుకుంటారు. పిల్లలను గారాబం చేయకూడదని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా వారిని అవసరమైతే కఠినంగానే దండించాలని స్నేహారెడ్డి బన్నీతో గొడవ పెట్టుకుంటుంది. తాజాగా ఈ విషయంమీదే ఇద్దరూ చిన్నపాటి గొడవ పడినట్లు సోషల్ మీడియాలో వార్త హల్ చల్ చేసింది. పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న బన్నీకి రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. ఈ సినిమాను దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా విడుదల చేయడానికి నిర్మాత, దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే బన్నీ మైనపు విగ్రహాన్ని టుస్సాడ్ మ్యూజియంలో ఆవిష్కరించారు. జర్మనీలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కు భారత్ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+