ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆ లేడి ఔట్...?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 ప్రేక్షకులను ఎంతోబాగా ఆకట్టుకుంటుంది. ఉల్టా పుల్టా నేపథ్యంలో కొనసాగుతున్న ఈ షోలో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నారు. ఊహించని విధంగా ఎలిమినేషన్ల ప్రక్రియ సాగుతుంది. గత వారం ఎలిమినేషనల్ బిగ్‌బాస్ హౌస్ నుంచి భోలే షావలి ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక, ఈ వారం ఎలిమినేషన్‌లో ఎవరూ అవుతారనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలయ్యింది. అయితే, ఈ వారం ఇంటినుంచే ఓ లేడి కంటెస్టెంట్ బయటకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం...
ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమెనా : ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా హౌస్ నుంచి బయటికి వెళ్లేందుకు శోభాశెట్టి, ప్రియాంక, అమర్‌దీప్, అర్జున్, అశ్విని ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతిక రోజ్, నామినేట్ అవ్వడం జరిగింది. శివాజి కెప్టెన్ కావడం వల్ల నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పకున్నారు. ఇక, ప్రశాంత్‌కు ఒక్క ఓటు మాత్రమే పడడం వల్ల రైతు బిడ్డకూడా ఈ వారం నామినేషన్స్‌లో లేనట్టే..ఇక శుక్రవారంతో ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో అన్ అఫీషియల్ పోల్స్ ప్రకారం ఓటింగ్‌లో కార్తికదీపం ఫేమ్ మోనిత్ చివరిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈసారి ఇంటి నుంచి ఈ లేడి కంటెస్టెంట్ బ్యాగ్ సర్దేసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

చివరి స్థానంలో శోభాశెట్టి : ఈ పోల్స్ ప్రకారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో 34 శాతం ఓట్లతో ప్రిన్స్ యావర్ టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాతి స్థానంలో అమర్‌దీప్ 19 శాతం ఓటింగ్‌తో రెండో స్థానంలో ఉన్నట్లు సమాచారం. ఇక ఆ తర్వాత వరుసగా రతిక, అశ్విని, ప్రియాంక, అర్జున్, గౌతమ్, చివరి స్థానంలో శోభా ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. దీంతో ఈ వారం డేంజర్ జోన్‌లో శోభాతో పాటు గౌతమ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న శోభాశెట్టి ఈసారి ఇంటి నుంచి బయటికి వచ్చేసిందని, దీనికి సంబంధించిన షూట్ కూడా జరుగుతోందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ ప్రచారం అవుతోంది. అయితే, ఈ న్యూస్‌లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

నాలుగు వారాలు మాత్రమే : ఇక, ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయితే, బిగ్‌బాస్ హౌజ్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉంటారు. ఈ సీజన్‌లో నాలుగువారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ నాలుగు వారాల్లో ఫైనల్ వారాన్ని మినహాయిస్తే మూడు వారాలు మాత్రమే ఉంటుంది. ఇక చివరివారంలో టాప్ ఫైవ్ మాత్రమే మిగిలి ఉంటారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే..మూడు వారాలకు నలుగురు కంటెస్టెంట్లు ఉంటారు. కాబట్టి, ఈ మూడు వారాల్లో ఏదో ఒక వారంలో డబుల్ ఎవిక్షన్ ఉంటుందని సమాచారం. అయితే, ఈ డబుల్ ఎలిమినేషన్ ఈ వారమే అయితే శోభాతోపాటు మరో కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉంది. లేకపోతే ఈ మూడు వారాల్లో ఏదో ఒక వారంలో డబుల్ ఎలిమినేషన్ మాత్రం తప్పేటట్లు లేదని తెలుస్తోంది. అయితే, ఈ సీజన్‌లో టాప్ ఫైవ్‌లో మాత్రం శివాజీ, ప్రశాంత్, యావర్, అమర్, ప్రియాంక ఉండబోతున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications