నెగిటివ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్.. నీకే సాధ్యం అన్నా..!!
నేచురల్ స్టార్ నాని- టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన మూవీ 'ది ప్యారడైజ్'.. భారీ అంచనాలతో సెప్టెంబర్ 24న ఈ మూవీ థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అంతకు ముందు రోజు ప్యారడైజ్ చిత్రానికి ప్రీమియర్స్ పడ్డాయి. అయితే అప్పుడు టాక్ నెగెటివ్ వచ్చింది. డిజాస్టర్ అన్నారు.. ఈ మూవీ కంటే టాక్సిక్ బెటర్ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఫస్ట్ షో కు కాస్త టాక్ మారింది.. అలా ఈవెనింగ్ షో కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత శని, ఆదివారాలు హిట్ టాక్ తో థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది ప్యారడైజ్ మూవీ.. అయితే ఆ తర్వాత సోమవారం నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కాస్త తగ్గినా వీకెండ్స్ లో మూవీ మరోసారి పుంజుకుంది. దాంతో ఈ మూవీ నెగటివ్ టాక్ తోనే ఈజీగా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. పూర్తిగా పక్కా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రెజెంట్ చేసిన విధానం చాలా రస్టిగ్ గా ఉంటుంది. హెవీ వైలెన్స్ సీన్స్ చాలానే ఉన్నాయి.
అలాగే ఈ మూవీలోని సాంగ్స్ జనాల్లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించాయి. ఆయా షేర్ సాంగ్ ఓ సంచలనం అని చెప్పాలి. ఆ తర్వాత ఏషనాగుల పాట కూడా యూట్యూబ్ లో విధ్వంసం సృష్టించింది. ఈ రెండు పాటలు సినిమాపై పాజిటివ్ బజ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఎంతలా అంటే సినిమాపై ఫ్యాన్స్ కు ఉన్న హైప్ కు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలేదు. ఈ మధ్య కాలంలో ట్రైలర్ లేకుండా డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే అని తెలుస్తోంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి 10 రోజులు పూర్తయింది. మొత్తం కలెక్షన్స్ చూస్తే 10 రోజుల్లో ఈ చిత్రానికి రూ. 167.39కోట్లు వచ్చాయి. ఇండియా గ్రాస్ రూ.136.44కోట్లు, ఇండియా నెట్ రూ.115.56కోట్లుగా ఉంది. అటు ఓవర్సీస్ లో దీనికి రూ.31 కోట్లు వచ్చాయి. ఇక ఇవాళ ఆదివారం కావడంతో వసూళ్లు కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి నెగెటివ్ టాక్ తోనూ ప్యారడైజ్ మూవీ ఈ రేంజ్ కలెక్షన్స్ ను సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి.

ఈ మూవీలో నాని సరసన హీరోయిన్ గా కయాదు లోహర్ నటించింది. అలాగే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సికంజా మాలిక్ అనే శక్తివంతమైన పాత్రలో నటించారు. అలాగే సంపూర్ణేష్ బాబు బిర్యాని అనే కీలక పాత్రలో మెరిశాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక ఫుల్ రన్ లో ఈ మూవీ ఇంకెన్ని రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications
