మహేష్ బాబు సంచలన పోస్ట్!
రెజ్లింగ్లో కేవలం 100 గ్రాముల బరువు అదనంగా ఉందని ఫైనల్ లో పతకం పోగొట్టుకున్న వినేశ్ ఫొగట్ ప్రస్తుతం తీవ్రమైన ఆవేదనలో ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్ కు దూసుకు వెళ్లిన వినేశ్ రజిత పతకంతో ప్రస్తుతానికి సరిపెట్టుకోవాల్సి వచ్చింది.అనూహ్యరీతిలో ఒలంపిక్స్ నుంచి వైదొలగవలసి వచ్చిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగట్ తను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఒలంపిక్స్ లో చరిత్ర సృష్టించిన భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్
మహిళల విభాగంలో తొలిసారిగా ఫైనల్ చేరిన భారత రెజ్లర్ గా చరిత్ర సృష్టించిన వినేష్ ఫోగట్ నిన్న ఫైనల్స్ లో తలపడాల్సి ఉండగా ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100గ్రాములు అదనంగా ఉందని గుర్తించారు. అయితే వినేశ్ ఫొగట్ 100 గ్రాములు బరువు తగ్గేందుకు కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా శతవిధాల ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. ఫలితంగా ఆమెపై అనర్హత వేటు పడింది. ఇది భారతీయులందరినీ బాధించింది.

వినేశ్ ఫొగట్ పై మహేష్ బాబు పోస్ట్
ఇక వినేశ్ ఫొగట్ ఫైనల్ లో ఆడేందుకు చూపించిన స్ఫూర్తి చేసిన పోరాటం దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి. ఆమెపై అనర్హత వేటు వేసినప్పటికీ ఆమెకు అండగా దేశవ్యాప్తంగా ప్రముఖులు తమ గొంతును వినిపించారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వినేష్ కు అండగా నిలబడ్డారు.
మీరు నిజమైన ఛాంపియన్.. మహేష్ బాబు స్పందన
ఎక్స్ వేదికగా వినేశ్ ఎపిసోడ్ పై స్పందించిన మహేష్ బాబు రిజల్ట్స్ తో సంబంధం లేదు. వినేశ్ మీరు ఫైనల్ వరకు చేరుకున్నారు అది మీ గొప్పతనం అని చెప్పాలి. మీరు నిజమైన ఛాంపియన్ ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు.. కష్టాలలో అండగా నిలవడానికి మీ దృఢత్వం, బలం అందరికీ స్ఫూర్తిదాయకం అన్నారు మహేష్ బాబు.
Today’s outcome doesn't matter, but your greatness in how you coped with the decision does 👏👏👏#VineshPhogat, you’ve shown everyone that your heart is that of a true champion; your resilience and strength to stand tall in difficult times inspires us all.
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2024
Medal or not, your…
1.4 బిలియన్ హృదయాలు మీతో పాటుగా ఉన్నాయన్న మహేష్ బాబు
పతకం రావడం ముఖ్యం కాదు.. మీ స్ఫూర్తి మా అందరిలో ప్రకాశిస్తుంది .1.4 బిలియన్ హృదయాలు మీతో పాటుగా ఉన్నాయి అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు వినేశ్ ఫొగట్ ను ప్రశంసించారు. ప్రస్తుతం ఆయన పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు వినేశ్ కు మద్దతుగా పోస్టులు పెట్టారు. వారిలో సమంత, తాప్సి వంటి వారు ఉన్నారు.
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications