Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహేష్‌బాబు - అల్లు అర్జున్ మధ్య పెరిగిన దూరం

టాలీవుడ్‌లో అగ్ర హీరోలైన మహేష్ బాబు, అల్లు అర్జున్ మధ్య కొనసాగుతున్న విబేధాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఇద్దరు స్టార్ల మధ్య ఎందుకు గ్యాప్ వచ్చింది? అందుకు కారణాలేంటి? అసలేం జరిగింది? అనే వివరాలను తెలుసుకుందాం. తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలందరూ పైకి ఎంతో స్నేహంగా కనిపిస్తూ, ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అభిమానులు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నా, హీరోలు మాత్రం కలిసే ఉంటారని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం నాలుగేళ్లుగా 'కోల్డ్ వార్' నడుస్తోందనేది బహిరంగ రహస్యం. వీరి మధ్య ఉన్న ఈ వార్ నడవడానికి ప్రధాన కారణం 2020 సంక్రాంతి పోరు.

ఇద్దరి మధ్య ఆరోజు గ్యాప్ ఏర్పడింది

ఆ ఏడాది మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి.'రిలీజ్ డేట్' విషయంలో ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. జనవరి 11న తన సినిమా సోలోగా రావాలని మహేష్ అనుకున్నారు. అల్లు అర్జున్ కూడా అదే తేదీకి తన సినిమా రావాలని నిర్మాతలతో చెప్పారు. ఇద్దరు హీరోలు వెనక్కి తగ్గకపోవడంతో టాలీవుడ్ పెద్దలు రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరకు మెగాస్టార్ చిరంజీవి జోక్యంతో అల్లు అర్జున్ ఒక రోజు వెనక్కి తగ్గి జనవరి 12న తన చిత్రాన్ని విడుదల చేశారు. కానీ, ఆ సమయంలో జరిగిన చర్చలు, ఇద్దరి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇప్పటికీ తగ్గలేదని తెలుస్తోంది.

Tollywood The Emerging Divide Between Two Telugu Superstars Mahesh Babu and Allu Arjun

మహేష్ బాబు విషెస్ చెప్పరు

టాలీవుడ్‌లో ప్రతి చిన్న వేడుకకు, స్టార్ హీరోల పుట్టినరోజులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలపడం మహేష్ బాబుకు అలవాటు. రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలను ప్రతి ఏటా విష్ చేసే మహేష్, అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు మాత్రం విషెస్ చెప్పరు. మొన్న బన్నీ బర్త్‌డే కు టాలీవుడ్ స్టార్లందరూ విష్ చేసినా, మహేష్ బాబు నుండి ఎటువంటి స్పందన లేకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రభాస్ కూడా విష్ చేయకపోవడంతో, టాలీవుడ్ గ్రూపులు మారిపోతున్నాయా అనే సందేహాలు మొదలయ్యాయి.

అభిమానులు మాత్రం కలిసే ఉన్నారు

అయితే ఇక్కడో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా హీరోలు బాగుంటే ఫ్యాన్స్ కొట్టుకుంటారు, కానీ ఇక్కడ హీరోలు దూరంగా ఉంటే.. మహేష్ - బన్నీ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో 'మిత్రులు'గా మారిపోయారు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఫ్యాన్స్ చేసే ట్రోల్స్‌ను తిప్పికొట్టడానికి ఈ ఇద్దరి హీరోల అభిమానులు ఒక కూటమిగా ఏర్పడి పరస్పరం సహకరించుకుంటున్నారు. ఫ్యాన్స్ ఇంత సఖ్యతగా ఉన్నా, పైన హీరోలు మాత్రం ఒకరినొకరు పలకరించుకోవడానికి కూడా ఇష్టపడకపోవడం గమనార్హం

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+