Top 10 Heroines..టాప్ వన్ లో సమంత; రష్మికను దాటేసిన శ్రీలీల!!
సహజంగా సినిమాలలో హిట్, ప్లాప్ లను బట్టి, హీరో, హీరోయిన్లకు వస్తున్న ఆఫర్లను బట్టి, ఇండస్ట్రీలో వారికి ఉన్న క్రేజ్ ను బట్టి ఎవరు టాప్ వన్ లో ఉన్నారు? ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? అనేది తెలుసుకునేందుకు చాలామంది అభిమానులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఆర్మాక్స్ మీడియా సంస్థ కేవలం అభిమానుల ఓటింగ్ ను ఆధారం చేసుకుని టాప్ టెన్ హీరోయిన్ల జాబితాను వెల్లడించింది.
టాప్ 1లో సమంత
సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న, ట్రెండింగ్ లో ఉన్న టాప్ టెన్ హీరోయిన్లను వెల్లడించింది. ఇక ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం మార్చి నెలలో టాప్ వన్ లో మొదటి స్థానాన్ని సమంత దక్కించుకుంది. పెద్దగా సినిమాలు చేయకపోయినా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సమంత ట్రెండింగ్ లో ఉండడంతో అభిమానులు సమంత ను టాప్ వన్ పొజిషన్లో నిలిపారు.

టాప్ 2, 3లో వీళ్ళే
ఇక టాప్ టు లో మగధీర ఫేమ్ కాజల్ అగర్వాల్ నిలిచారు. ఇప్పటికీ ఒక రేంజ్ లో కాజల్ అగర్వాల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాప్ త్రీ లో అనుష్క శెట్టి నిలిచారు. ఇటీవల కాలంలో అనుష్క పెద్దగా సినిమాలు చేయకపోయినా అనుష్క మీద జనాల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
టాప్ 4లో శ్రీలీల,రష్మిక స్థానం ఇదే
ఇక టాప్ ఫోర్ పొజిషన్లో రీసెంట్ గా సినిమాలలో దుమ్మురేపుతున్న, తన డాన్సులతో అదరగొడుతున్న క్యూట్ బ్యూటీ శ్రీలీల నిలిచారు. టాప్ ఫైవ్ లో సాయి పల్లవికి ఫ్యాన్స్ పట్టం కట్టారు. ఇక టాప్ సిక్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నిలిచారు. పుష్ప, యానిమల్ వంటి సినిమాలతో భారీ హిట్లు కొడుతున్న రష్మిక కు ఫ్యాన్స్ ఆరో స్థానాన్ని ఇచ్చారు.
టాప్ సెవెన్ లో కీర్తి సురేష్, టాప్ నైన్ లో పూజా హెగ్డే
టాప్ సెవెన్ లో కీర్తి సురేష్ నిలిచారు. టాప్ 8 లో తమన్నా భాటియా, టాప్ నైన్ లో పూజా హెగ్డే, టాప్ టెన్ లో అనుపమ పరమేశ్వర్ నిలిచారు. అభిమానులు తమ హీరోయిన్లపై అభిమానంతో చేసిన ఓటింగ్ ఆధారంగా ఆర్మాక్స్ మీడియా సంస్థ ఈ సర్వే చేసి ఫలితాలను వెల్లడించింది.












Click it and Unblock the Notifications