సినీ పరిశ్రమలో విషాదం.. స్టార్ ప్రొడ్యూసర్ భార్య మృతి..
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్టార్ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి నిన్న రాత్రి కన్నుమూశారు. వరలక్ష్మి (62) గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ బుధవారం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషయం తెలిసిన తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు టీవీ, సినీ ప్రముఖులు వరలక్ష్మి మృతికి నివాళులర్పిస్తూ శ్యామ్ ప్రసాద్ రెడ్డిని పరామర్శిస్తున్నారు. వరలక్ష్మి అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె అయిన వరలక్ష్మిని ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు.

నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి గతంలో అమ్మోరు, అంజి, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమాలకు దూరంగా ఉంటూ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఢీ లాంటి పలు సూపర్ హిట్ టీవీ షోలను, సీరియల్స్‌ను నిర్మిస్తున్నారు.
టీవీ షోలు, సీరియల్స్ ద్వారా శ్యామ్ ప్రసాద్ రెడ్డి కొత్తనటులను ప్రోత్సహించడమే కాకుండా ఎంతో మందికి అవకాశాలు కూడా ఇస్తున్నారు. అలాంటి వారు చాలామంది ఇప్పడు సినిమాల్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీటితోపాటు శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఢీ, క్యాష్, స్టార్ మహిళ వంటి షో లకు కూడా నిర్మాతగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications