'దబిడి దిబిడి' పాటలో ఊర్వశి రౌతేలా బట్టలు ఉతుకుతున్న బాలయ్య?

నందమూరి బాలకృష్ణ వరుసగా మూడు సూపర్ హిట్ సినిమాలు అందించిన తర్వాత కొల్లి బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ చిత్రం చేస్తున్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని ఈనెల 12వ తేదీన సినిమా విడుదల కాబోతోంది. దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయికానీ చిత్ర బృందం మాత్రం ప్రమోషన్స్ విషయంలో అలక్ష్యంగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా ఓపాటను విడుదల చేశారు. బాలయ్య, ఊర్వశి రౌతేలా ఇందులో నర్తించారు. ఈ సినిమాలో ఇది ఐటం సాంగ్. ఈ పాట కోసమే ఊర్వశిని ప్రత్యేకంగా తీసుకున్నారు.

ట్రెండింగ్ లో నిలిచిన పాట
ప్రస్తుతం ఈ పాట టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 'దబిడి దిబిడి' పేరుతో విడుదలైన ఈ పాటపై ప్రస్తుతం ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తే శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటలోని నృత్యరీతుల ప్రకారం బాలయ్య ఊర్వశి వెనకాల చేతులతో కొడుతుంటాడు. వీటిని నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ చేసిన కొరియోగ్రఫీ చాలా దారుణంగా ఉందని, దీనికంటే టీవీల్లో ఏవైనా కార్యక్రమాలు చూసుకొని జడ్జిగా ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు. అతనికంటే జానీమాస్టర్ మంచి కొరియోగ్రఫీ చేస్తాడంటున్నారు. నీకు దండం పెడతారా బాబు.. ఇదేం కొరియోగ్రఫీరా నాయనా అంటున్నారు. ఊర్వశి రౌతేలా బట్టలు బాలయ్య ఉతుకుతున్నాడా? లేదంటే దెబ్బలు కొడుతున్నాడా? ఏం చేస్తున్నాడురా శేఖర్ మాస్టర్ అంటున్నారు.

trolls on nandamuri balakrishna song dabidi dibidi in daaku maharaaj movie

దెబ్బలు పడతాయి శేఖర్ మాస్టర్
మరికొందరు పుష్ప2లోని దెబ్బలు పడతాయిరో అనే పాటను శేఖర్ మాస్టర్ కు యాడ్ చేస్తున్నారు. సరిగ్గా కొరియోగ్రఫీ చేయనందుకు నీకు దెబ్బలు తప్పవని అర్థం. సోషల్ మీడియాలో నెటిజన్లు, బాలయ్య అభిమానులు శేఖర్ పై రచ్చరచ్చ చేస్తున్నారు. పాట బాగుండి ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ పాటపై నెగెటివ్ ప్రచారం జరుగుతుండటంతో ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. శేఖర్ మాస్టర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారు. బాలకృష్ణ చేత ఇలాంటి స్టెప్స్ వేయిస్తావా? అంటూ మండిపడుతున్నారు. దీనికి శేఖర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానరుపై సూర్యదేవర నాగవంశీ దీన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర కథ మాత్రం ఇంతవరకు బయటకు రాకుండా యూనిట్ జాగ్రత్తపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+