'ఆమె'పై మనసుపడ్డ యాంకర్ ప్రదీప్?

యాంకర్ ప్రదీప్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియనివారుండరు. అన్ని ప్రముఖ తెలుగు ఛానెళ్లలో షోలు చేశాడు.. చేస్తున్నాడు. తను చేసే షోలన్నీ మంచి టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టేవి. ప్రదీప్ లా విజయవంతమైన మేల్ యాంకర్స్ లేరని చెప్పొచ్చు. కొంతకాలం నుంచి చిన్నితెరకు ప్రదీప్ దూరమయ్యాడు. కొన్ని సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తున్న ఢీ షో నుంచి తప్పుకున్నాడు. ప్రదీప్ స్థానంలో ప్రముఖ నటుడు నందు వచ్చాడు. దీంతో ప్రదీప్ అభిమానులు నిరాశకు గురయ్యారు.

పెళ్లి చేసుకునే ప్రతిపాదనలు రావడంవల్లే షోలు చేయడం మానేస్తున్నాడంటూ రకరకాల వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తను స్పందించలేదు. ఇటీవలే జిమ్ లో వ్యాయామం చేస్తున్న ఫొటోలను షేర్ చేశాడు. ఏదైనా సినిమా ఒప్పుకున్నాడేమో అందుకే ఫొటోలు షేర్ చేశాడని అభిమానులు చర్చించుకున్నారు. దీనికి తగినట్లుగానే ఓ వార్త బయటకు వచ్చింది. ప్రదీప్ మరోసారి హీరోగా రాబోతున్నాడనేది ఆ వార్త సారాంశం.

tv anchor pradeep machiraju will do another movie deepika pilli is heroine

యాంకరింగ్ చేస్తూనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. 'జులాయి', 'అత్తారింటికి దారేది' లాంటి సినిమాల్లో నటించాడు. '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. దీనికి మంచి ఆదరణ దక్కింది. ప్రదీప్ వరుసగా సినిమాలు చేస్తాడని అందరూ భావించాడు. అయితే అతను మాత్రం యాంకర్ గా చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం దానికి కూడా దూరమయ్యాడు.

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మరోసారి హీరోగా నటించబోతున్నాడని తెలుస్తోంది. ప్రదీప్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పిల్లి నటించబోతోంది. టిక్ టాక్ వీడియోలు చేస్తూ పాపులర్ అయిన దీపికా పిల్లి 'ఢీ' షోలో యాంకర్ గా సందడి చేసింది. దీనిద్వారా ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. 'వాంటెడ్ పండుగాడు' చిత్రంలో ఓ పాత్ర చేసింది. ఈ సారి ఏకంగా ప్రదీప్ సరసన హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. ఇదే నిజమైతే దీపికకు బంపర్ ఆఫర్ తగిలినట్లే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+