‘నా మీద అలాంటి రూమర్స్... కెరీర్‌ను నాశనం చేసింది వాళ్లే’

యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట యాంకరింగ్‌కు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది ఈ రంగంలోకి రావడానికి కారణమయ్యారు. ఒకానొక దశలో టెలివిజన్ షోలు, సినిమా ఈవెంట్స్, సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపారు. కానీ అనూహ్యంగా యాంకరింగ్‌తో పాటు సినిమాలకు కూడా దూరమైపోయారు. ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చిన ఉదయభాను.. యాంకరింగ్ వైపు కాకుండా సినిమాలలో నటనతో పాటు నిర్మాణ రంగం వైపు ఫోకస్ పెట్టారు. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉదయభాను మాట్లాడుతూ తన కెరీర్ నాశనం అవ్వడానికి కారణమైన పరిస్ధితుల గురించి బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగునాట కేబుల్ టీవీ ప్రసారాలు ఊపందుకుంటున్న దశలో యాంకర్‌గా అడుగుపెట్టారు ఉదయభాను. హృదయాంజలి, వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా ఢింబక, రేలారే రేలా తదితర కార్యక్రమాలతో ప్రేక్షకుల బాగా దగ్గరయ్యారు ఉదయభాను. టీవీ షోలతో పాటు సినిమా ఈవెంట్స్‌కు హోస్ట్‌గా చేయడంతో పాటు నటిగానూ కొన్ని సినిమాలలో నటించారు. యాంకర్ అంటే ఉదయభాను.. ఉదయభాను అంటే యాంకర్ అన్నంతగా తన ముద్రవేశారు. ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నప్పటికీ ఉదయభాను స్క్రీన్ ప్రెజెన్స్, మాటతీరుతో వాళ్లందరినీ దాటేశారు.

Udaya Bhanu Reveals Why Her Career Suffered Says PR Agents Spread False Rumours About Her

కెరీర్ పీక్స్‌లో ఉండగానే యాంకరింగ్‌కు అనూహ్యంగా దూరమయ్యారు ఉదయభాను. పెళ్లి, పిల్లలతో కుటుంబ జీవితానికి అంకితమయ్యారు. యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి పలు వీడియోలు చేస్తూ ప్రేక్షకులతో టచ్‌లో ఉన్నారు. అయితే ఛానాళ్ల తర్వాత ఓ కార్యక్రమానికి హోస్ట్‌గా వచ్చిన ఉదయభాను.. టాలీవుడ్‌లో సిండికేట్‌లు తయారయ్యాయని, తనకు అవకాశాలు రానివ్వడం లేదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తుండటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి మంచి పాత్రలు చేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ.

నిర్మాతగా మారాలని కలలు కన్న ఉదయభాను.. ఎట్టకేలకు ఆ కల నెరవేర్చుకున్నారు. ఉదయభాను ప్రొడక్షన్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను స్థాపించి నిర్మాతగా పంచనామా అనే వెబ్ సిరీస్ నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ వెబ్ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయభాను.. తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కెరీర్ నాశనం కావడానికి చాలా కారణాలు ఉన్నాయి.. పీఆర్‌వోలది ఇందులో కీలకపాత్ర. నేనొక ఛానెల్‌కు వెళ్లొస్తున్నాను, అక్కడి ఛానెల్ ఎండీ నాకు కాఫీ ఆఫర్ చేసి మాట్లాడుతున్నారు. పక్కనే మార్కెటింగ్ అతను ఉన్నాడు. భాను గారు 6 లక్షల రూపాయలు తీసుకుంటారని చెప్పారు, నేను తనతో మాట్లాడమని చెప్పాను. ఆవిడది చాలా హై బడ్జెట్ అని చెబుతున్నారు.. కానీ ఆమె అంత ఛార్జ్ చేయరని నా ముందే జరిగింది చెప్పారు అని ఉదయభాను తెలిపారు.

ఇలాంటివి నేను ఎన్నో విన్నా.. నా దాకా అవకాశాలు రానివ్వలేదు. ఎందుకు రానివ్వరు? ఏంటీ? అనేది నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. స్టేజ్ ఎక్కిన తర్వాత కారులో వెయిట్ చేసి వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కొద్దో గొప్పో తెలివితేటలు ఉండి.. డ్యాన్స్ చేయగలిగి కూడా నాకెందుకు అవకాశాలు రాలేదు, అన్ని ఛానెల్స్‌ నన్ను పక్కనపెట్టేశాయి. ఎందుకు? ఎవరు ఇదంతా చేశారన్నది నాకు తెలియదు. చాలా మందైతే దీని వెనుక ఉన్నారు.. నా మీద ప్రాపగాండ జరిగిన మాట వాస్తవం. నేను ఉదయాన్నే 3 గంటలకు కూడా లేచి రెడీగా ఉంటాను, నా బట్టలు నేను కుట్టుకుంటాను, ఈ ప్రొఫెషన్ అంటే నాకు అంత ఇష్టం. అలాంటి నన్ను పట్టుకుని నేను డిసిప్లిన్‌గా ఉండనని పుకారు పుట్టించారని ఉదయభాను ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+