సెకండ్ ప్రెగ్నెన్సీపై మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన..

తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. రామ్ చరణ్- ఉపాసనలకు టాలీవుడ్‌లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. మొదట్లో ఉపాసనను విమర్శించిన వారే ఇప్పుడు..ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది మెగా అభిమానులకు శుభవార్తనే అందించారామె.మెగా కోడలు ఉపాసన తల్లిగా మారిన సంగతి అందరికి తెలిసిందే.

పెళ్లైన 11 ఏళ్లకు రామ్ చరణ్- ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ క్లారా అని నామకారణం చేయడం జరిగింది. క్లీన్ క్లారా రాకతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే క్లీన్ క్లారాను మాత్రం ఇప్పటి వరకూ బాహ్య ప్రపంచానికి చూపించలేదు.

Upasana good news on second pregnancy

దీంతో క్లీన్ క్లారాను చూడటానికి మెగా అభిమానులు కూడా చాలా అతృతుగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాసన తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండో బిడ్డను వెంటనే ప్లాన్ చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.తాజాగా ఉపాసన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తరువాత తల్లిని అయ్యాను.

ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలాంటి తప్పులు చేయలని అనుకోవడం లేదు. సెకండ్ చైల్డ్‌ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించింది. ఉపాసన కామెంట్స్‌పై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొందర్లోనే మెగా వారసుడును చూడబోతున్నామంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+