రెండు వారాల్లోనే రూ. 200 కోట్లా.. నువ్ మామూలోడివి కాదన్నా..!
రిలీజ్ అయిన రెండు వారాల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూల్లు.. ఇదేదో పెద్ద సినిమానో.. స్టార్ హీరో సినిమానో కాదు.. చిన్న సినిమాకు అద్దిరిపోయే కలెక్షన్లు.. అది కూడా మలయాళంలో కావడం విశేషం. అవును కేవలం రూ. 10 కోట్లతో తీసిన ఈ సినిమా రిలీజైన రెండు వారాల్లోనే రూ. 200 కోట్లు రాబట్టింది. బ్లాక్ బస్టర్ టాక్ తో థియేటర్లలో దూసుకెళ్తోంది. మరి ఆ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
ఇప్పుడంతా చిన్న సినిమాలదే హవా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాయి. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలను పొందుతున్నాయి. మంచి కథ, కథనం, మ్యూజిక్ తో అలరిస్తున్నాయి. ఇప్పుడు మలయాళంలో ఓ సినిమా సెన్సేషన్ అవుతోంది. అదే వాజా 2 మూవీ.. వాజా 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ మూవీ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. ఈ మూవీ రిలీజ్ అయిన కేవలం 17 రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక మున్ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

ఇక వాజా 2 సినిమా స్టోరీ చాలా సింపుల్.. పాఠశాలలో అల్లరి చిల్లరగా తిరిగే నలుగురు కుర్రాళ్లు.. పెద్దయ్యాక జీవితంలో ఎలా సెటిలర్ అయ్యారు అన్నదే ఈ సినిమా లైన్. ఈ మూవీ కథ రియాలిటీకి దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఆడియన్స్ కు బాగా ఎక్కింది. ఈ నేపథ్యంలోనే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతోంది. అయితే మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. వాలా 2 పేరుతో ఈనెల 24 న రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఇక వాజా 2 సినిమాకు స్టోరీని అందించింది విపిన్ దాస్ కాగా.. దర్శకత్వం వహించింది సవిన్ షా. ప్రొడ్యూసర్లుగా సాహు గారపాటి, విపిన్ దాస్ వ్యవహరించారు.












Click it and Unblock the Notifications