డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చింది.. నటిపై డైరెక్టర్ ఫైర్!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏ క్షణాన ఎలాంటి వివాదాలు రేగుతాయో ఊహించడం చాలా కష్టం. ఇక్కడ దర్శకులకు, నటీనటులకు అభిప్రాయ బేధాలు రావడం సర్వసాధారణమే. ప్రస్తుతం ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ చుట్టూ ఇలాంటి ఓ సరికొత్త వివాదం ముదురుతోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'పోలీస్ స్టేషన్' చిత్ర దర్శకుడు వరలక్ష్మిపై మీడియా ముఖంగా చేసిన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

'జైలర్ 2'లో హృతిక్ రోషన్.. 40 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో!
'జైలర్ 2'లో హృతిక్ రోషన్.. 40 ఏళ్ల తర్వాత క్రేజీ కాంబో!

ఆ సినిమా డైరెక్టర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 'పోలీస్ స్టేషన్' సినిమా కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌కు రూ.75 లక్షల భారీ రెమ్యునరేషన్ చెల్లించినట్లు చెప్పాడు. కేవలం సినిమా నటనకే కాకుండా, ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనడానికి కూడా అదనపు రెమ్యునరేషన్ ఇచ్చామని ఆయన పేర్కొన్నాడు. అయితే ఆమె సినిమా ప్రమోషన్లకు హాజరుకాకుండా హ్యాండ్ ఇచ్చిందని డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బులు తీసుకుని కూడా సినిమాను ప్రమోట్ చేయాల్సిన కనీస బాధ్యతను ఆమె మర్చిపోయిందంటూ ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

Varalaxmi Sarathkumar Responds Coolly to Police Station Director Remuneration Allegations Full Details

దర్శకుడు చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తాజాగా స్పందించారు. అయితే, ఆమె ఎక్కడా సహనం కోల్పోకుండా చాలా హుందాగా, క్లుప్తంగా దీనికి సమాధానం ఇచ్చారు. ఓ నటిగా సినిమా మేకింగ్ ప్రక్రియలో ఉన్న డిమాండ్లకు తగ్గట్టుగా నటించడమే తన ప్రాథమిక విధి అని ఆమె స్పష్టం చేశారు. తన పాత్రకు, సినిమాకు తాను పూర్తి న్యాయం చేశానని, ఇచ్చిన కమిట్‌మెంట్‌ను నిలబెట్టుకున్నానని ఆమె నమ్మకంగా చెప్పారు.

వన్డేల్లో ఐపీఎల్ రేంజ్ బ్యాటింగ్.. బుడ్డోడి ఊచకోత !
వన్డేల్లో ఐపీఎల్ రేంజ్ బ్యాటింగ్.. బుడ్డోడి ఊచకోత !

"వాళ్లకు అవసరమైనప్పుడు నేను షూటింగ్‌లో ఉన్నాను, ఓ నటిగా నా బాధ్యతను పూర్తిగా నెరవేర్చాను. దర్శకుడు నాపై చేసిన కామెంట్ల గురించి నాకు పూర్తి సమాచారం ఉంది. కానీ ఈ సమయంలో దానిపై ఎక్కువగా స్పందించడానికి నేను ఇష్టపడటం లేదు" అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ చాలా ప్రొఫెషనల్ టోన్‌లో తేల్చి చెప్పారు. వరలక్ష్మి ఈ వివాదంపై తీవ్రంగా మండిపడుతుందని ఆశించిన వారికి, ఆమె ఇచ్చిన ఈ సింపుల్ ఆన్సర్‌తో షాక్ ఇచ్చింది. కాగా జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమాకు ఈ వివాదం ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+