వెంకీ 'ఆదర్శ కుటుంబం' నుంచి 'నారాయణమ్మ' సాంగ్ రిలీజ్.. తమన్ భయ్యా కుమ్మేశాడు..
విక్టరీ వెంకటేశ్- త్రివిక్రమ్ కాంబో అనగానే మనకు ఓ 'మల్లీశ్వరి', 'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలు గుర్తుకొస్తాయి. అయితే చాలా గ్యాప్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేసిన సినిమా 'ఆదర్శ కుటుంబం'.. ఈ మూవీలో వెంకటేశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న విడుదల కానుంది. తొలుత అక్టోబర్ 2 నే విడుదల కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఈ మూవీ వారం రోజుల పాటు వాయిదా పడింది. ఇక ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా నారాయణమ్మ అనే మాస్ బీట్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ప్రభ, రామ్ మిరియాల ఆలపించారు. నారాయణమ్మ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక ఈ పాటలో టాలీవుడ్ హాట్ బ్యూటీ డింపుల్ హయతి తనదైన స్టెప్పులతో అలరించింది.
డింపుల్ హయతి స్టెప్పులతో ఈ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మూవీలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, పూజిత పొన్నాడ, రావు రమేశ్ లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9న థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది.

ఇక వెంకటేశ్ గతేడాది 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. దాంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అటు త్రివిక్రమ్ తో చేసిన మళ్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ క్రేజీ కాంబోపై ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇక వెంటకేశ్ వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల అనే చిత్రంతో వస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ లో చెప్పినట్లుగానే జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది.












Click it and Unblock the Notifications
