'సంక్రాంతికి వస్తున్నాం' OTT డేట్ వచ్చేసింది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..
విక్టరీ వెంకటేశ్ హీరోగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఓటీటీ విడుదల తేదీని జీ5 సంస్థ ప్రకటించింది. ఈ చిత్రాన్ని జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓటీటీ విడుదల తేదీ కూడా ఖరారైంది.
మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్‌తో పాటు జీ5 ఓటీటీలోనూ ఈ చిత్రం ఒకేసారి అందుబాటులోకి రానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఒకే రోజు, ఒకే సమయానికి అటు టెలివిజన్, ఇటు ఓటీటీలో 'సంక్రాంతికి వస్తున్నాం' సందడి చేయనున్న నేపథ్యంలో వెంకీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే థియేటర్ నిడివి కంటే ఓటీటీలో రిలీజ్ చేసే ప్రింట్ లో మూవీ నిడివి ఎక్కువ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. గతంలో అనిల్ రావిపూడి తొలగించిన సీన్స్ ను మళ్లీ యాడ్ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కాగా, ఈ సినిమాను అనిల్ రావిపూడి తెరకెక్కించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300+ కోట్లు గ్రాస్ వసూల్ చేసింది.












Click it and Unblock the Notifications