విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు త‌ప్పిన ప్ర‌మాదం.. మెట్ల‌పై నుంచి స్లిప్ అయిన రౌడీ హీరో..

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మెట్ల మీద నుంచి దిగుతుండ‌గా.. కాలు జారి స్లిప్ అయ్యి ప‌డ్డాడు విజ‌య్. ఈ సంఘ‌ట‌నుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే, కింద‌ప‌డ్డ వెంటనే విజయ్ దేవరకొండను ఆయన టీం సురక్షితంగా లేపి బయటకు తీసుకొచ్చారు. ఇక‌, ఈ వీడియో చూసిన విజ‌య్ ఫ్యాన్స్ మాత్రం విజ‌య్‌కు ఏమైందోన‌ని తెగ కంగారు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ హీరియే పాట‌తో క్రేజ్ సంపాదించుకున్న బాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ జాస్లీన్ రాయ‌ల్ తో ఒక ప్రైవేట్ ఆల్బ‌మ్ చేస్తున్నారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న ముంబైలోని మితిబాయి క్షితిజ్ లో చోటుచేసుకుంది. మిథిబాయి క్షితిజ్ అంటే మిథిబాయి కళాశాల యాన్యువల్ కల్చరల్ ఫోర్ డేస్ ఫెస్ట్. 'సాహిబా' ఆల్బ‌మ్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా పాల్గొన్న విజ‌య్‌కీ తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఆల్బ‌మ్‌లో విజ‌య్ స‌రస‌న రాధిక మోహ‌న్ న‌టిస్తుంది. ఇప్పటికే రాధికా- జస్లీన్ రాయల్ కాంబినేషన్‌లో పాట వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే . అదే 'నై జానా' సాంగ్. ఇది ఎంత‌టి విజ‌యాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. దీంతో ఇక‌, విజ‌య్ సాంగ్ ఎలా ఉండ‌బోతుందా? అని ఆయ‌న అభిమానుల‌తోపాటు ప్రేక్ష‌కులు కూడా ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఈ ఆల్బ‌మ్‌కి సంబంధించి ఇప్ప‌టికే ఫ‌స్ట్ లుక్‌న్ కూడా విడుద‌ల చేశారు. ఈ సాంగ్‌ను న‌వంబ‌ర్ 15న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా సాహిబా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ముంబ‌యిలోని మితిబాయి క్షితిజ్‌లో విజ‌య్ పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో మెట్ల‌పై నుంచి జారి ప‌డ్డాడు. అయితే, వెంట‌నే అల‌ర్ట్ అయిన టీం విజ‌య్ ను వెంట‌నే పైకి లేపి జాగ్ర‌త్త‌గా బ‌య‌టికి తీసుకొచ్చారు.

Vijay Devarakonda s accident The hero who slipped from the stairs

మూవీ షూటింగ్‌లో ప్ర‌మాదం..

అయితే, ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ మూవీ షూటింగ్‌లో గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. విరామం తీసుకునే సమయం లేనందున షూటింగ్ కంటిన్యూ చేస్తున్న‌ట్లుగా కూడా ఆ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. విజ‌య్ గౌతమ్ తిన్ననూరితో తన తదుపరి చిత్రం షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్‌లోనే విజ‌య్ గాయ‌ప‌డ్డాడు. అయినా విశ్రాంతి లేకుండా షూటింగ్ కొన‌సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+