Truecaller: ఆ రూల్ వల్లే పెరిగిన మోసాలు! 140, 1600 సిరీస్ నంబర్ల గుట్టురట్టు..

ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ 'ట్రూకాలర్' (Truecaller) టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో స్పామ్, స్కామ్ కాల్స్ విపరీతంగా పెరిగిపోవడానికి ట్రాయ్ తీసుకొచ్చిన కాలర్ ఐడీ పాలసీయే కారణమని బుధవారం ఘాటుగా విమర్శించింది. టెలిమార్కెటింగ్, బ్యాంకింగ్ సేవల కోసం కేటాయించిన 140, 1600 సిరీస్ నంబర్లపై కమ్యూనిటీ స్పామ్ హెచ్చరికలను (Community spam warnings) చూపించకుండా యాప్స్‌ను నియంత్రించడం వల్ల వినియోగదారుల నమ్మకం దెబ్బతిని, స్కామర్లకు లాభం చేకూరిందని ట్రూకాలర్ ఆరోపించింది. ఇదే సమయంలో కాలర్ ఐడీ అప్లికేషన్లను నియంత్రించేందుకు ట్రాయ్ అధికారాలు కోరుతోందన్న నివేదికలను కూడా కంపెనీ కొట్టిపారేసింది.

రూల్స్ మార్చారు.. కానీ సీన్ రివర్స్ అయింది!

ఈ వివాదంపై ట్రూకాలర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) రిషిత్ జుంజున్‌వాలా 'X' (ట్విట్టర్) వేదికగా అత్యంత ఘాటుగా స్పందించారు. ఇంటర్నెట్ అప్లికేషన్లపై ఇలాంటి ఆదేశాలు ఇచ్చే అధికారం ట్రాయ్‌కు ఉందా లేదా అనే ప్రశ్నలు ఉన్నప్పటికీ.. తాము రెగ్యులేటర్ ఆదేశాల మేరకు ఆయా నంబర్ సిరీస్‌లను 'వైట్‌లిస్ట్' చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ నిర్ణయం వల్ల ఆశించిన ఫలితానికి పూర్తి భిన్నమైన పరిణామాలు ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Truecaller Blames TRAI Caller ID Rules For Huge Surge In Spam Calls And Decline In Consumer Platform Trust

"ఈ రెండు సిరీస్‌ల నుండి వచ్చే 5.1 కోట్లకు పైగా కాల్స్ రోజువారీగా జనం లిఫ్ట్ చేయడం లేదు" అని జుంజున్‌వాలా పేర్కొన్నారు. ఆయా నంబర్ల నుంచి స్పామ్, స్కామ్ కాల్స్ వస్తున్నట్లు వినియోగదారుల నుండి పెద్దఎత్తున రిపోర్టులు వస్తున్నా.. ట్రాయ్ నిబంధనల ప్రకారం ఆ కాల్స్ 'స్పామ్' అని మా యూజర్లకు చెప్పలేకపోతున్నామని ఆయన వెల్లడించారు.

ట్రాయ్ సీరియస్.. 'ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్' బ్యాడ్జ్ వివాదం

నిజానికి, 140, 1600 సిరీస్ నంబర్లను చాలామంది యూజర్లు బ్లాక్ చేస్తున్నప్పటికీ వాటిని 'స్పామ్' అని చూపించకుండా ట్రూకాలర్ ఇటీవల ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఎక్కువ మంది బ్లాక్ చేసిన నంబర్లకు 'ఫ్రీక్వెంట్లీ బ్లాక్డ్' (Frequently Blocked) అనే బ్యాడ్జ్‌ను ఇవ్వడం ప్రారంభించింది. ఇది నేరుగా స్పామ్ అని చెప్పకపోయినా.. సదరు నంబర్‌ను ఎక్కువ మంది తిరస్కరించారని యూజర్లను అలర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రాయ్.. ట్రూకాలర్ లాంటి కాలర్ ఐడీ యాప్స్‌ను నియంత్రించే అధికారాలు తమకు ఇవ్వాలంటూ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) కి లేఖ రాసినట్లు నివేదికలు వచ్చాయి.

మొబైల్ నంబర్లకు ఫీజు: క్లారిటీ ఇచ్చిన ట్రాయ్
మొబైల్ నంబర్లకు ఫీజు: క్లారిటీ ఇచ్చిన ట్రాయ్

నంబర్లపై నమ్మకం కోల్పోయిన జనం..

ట్రూకాలర్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ట్రాయ్ ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక నంబర్ సిరీస్‌లపై వినియోగదారులు పూర్తిగా నమ్మకం కోల్పోయారు. గత ఎనిమిది నెలల్లో 140-సిరీస్ కాల్స్‌లో 81 శాతం, 1600-సిరీస్ కాల్స్‌లో 79 శాతం కాల్స్‌ను యూజర్లు పూర్తిగా విస్మరించారు. అక్టోబర్ 2025 నుండి చూస్తే 1600-సిరీస్ నంబర్లను మాన్యువల్‌గా బ్లాక్ చేసే ప్రక్రియ 208 శాతం పెరిగింది. ఈ కాలంలో రెండు సిరీస్‌ల నుంచి వచ్చిన మొత్తం 7.4 కోట్ల కాల్స్‌ను యూజర్లు మాన్యువల్‌గా బ్లాక్ చేశారు.

మంచి చేసే వాళ్లను ఆపకండి: సీఈఓ

"ఇక చాలు అనుకున్నాం. అందుకే ఆ నంబర్లను స్పామ్‌గా మార్క్ చేయకపోయినా.. ఎక్కువ మంది బ్లాక్ చేసిన సమాచారాన్ని యూజర్లకు చూపిస్తున్నాం" అని సీఈఓ రిషిత్ జుంజున్‌వాలా అన్నారు. తమ లాంటి యాప్స్‌ను నియంత్రించాలనుకోవడం అసలు అర్థరహితమని మండిపడ్డారు. "మేము ప్రతిరోజూ కోట్లాది మంది భారతీయులకు సహాయం చేస్తున్న మంచి వ్యక్తులం.. అలా కాకుండా కమ్యూనిటీ సమాచారాన్ని సెన్సార్ చేయడం ద్వారా స్కామర్లకు ఓపెన్ ప్లేగ్రౌండ్ ఇవ్వాలని వారు చూస్తున్నారు. తప్పు చేసే వాళ్లపై చర్యలు తీసుకోండి, ట్రూకాలర్ లాంటి యాప్స్ పై కాదు" అని ఆయన స్పష్టం చేశారు.

 త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్
త్వరలో: 11 అంకెలతో కూడిన మొబైల్ నెంబర్లు..కసరత్తు చేస్తున్న ట్రాయ్

అసలు ఈ 140, 1600 సిరీస్ కథేంటి?

అవాంఛిత కమర్షియల్ కాల్స్, నకిలీ నంబర్ల మోసాలను అరికట్టడానికి ట్రాయ్ 2025 లో సరికొత్త నిబంధనలను (TCCCPR, 2025) తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సాధారణ మొబైల్ నంబర్ల నుండి కాకుండా.. ప్రమోషనల్ (Promotional) కాల్స్ కోసం '140' సిరీస్, బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల లావాదేవీల (Transactional) కాల్స్ కోసం '1600' సిరీస్ నంబర్లను కేటాయించింది. అయితే ఈ నంబర్ల వెనుక దాక్కుని స్కామర్లు రెచ్చిపోతున్నారని, కమ్యూనిటీ డేటాను నియంత్రించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి (MeitY) పూర్తి నివేదికను అందిస్తామని ట్రూకాలర్ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+