విజయ్ దేవరకొండ సినిమా ఫ్లాప్‌‌..పండగ చేసుకుంటున్న ఆ ఇద్దరు

విజయ్ దేవరకొండ..'ఫ్యామిలీ స్టార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'గీతగోవిందం' తరువాత దర్శకుడు పరుశురామ్‌తో మరోసారి కలిసి విజయ్ దేవరకొండ చేసిన సినిమా కావడంతో 'ఫ్యామిలీ స్టార్'పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది.

కథలో కొత్తదనం లేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. 'ఫ్యామిలీ స్టార్'పై ఆశలు పెట్టుకున్న విజయ్ దేవరకొండకు మరోసారి నిరాశ ఎదురైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే సినిమాకు నెగిటివ్ రివ్య్వూస్ రావడంతో విజయ్ దేవరకొండ అభిమానులు నిరాశ చెందుతున్నారు. మరోవైపు 'ఫ్యామిలీ స్టార్'‌కు ఓపెనింగ్ కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఇండియా వైట్ గా 5.75 కోట్లు వసూలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Vijay Devarakonda s movie flop those two are celebrating

ఇది విజయ్ దేవరకొండ రేంజ్ కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే 'ఫ్యామిలీ స్టార్' ఫలితంపై ఇద్దరు మాత్రం ఫుల్ ఖుషీ అవుతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇద్దరు మరెవ్వరో కాదు ఒకరు హీరో నాగ చైతన్య అయితే.. మరొకరు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో వీరిద్దరికి సంబంధం ఉంది. 'ఫ్యామిలీ స్టార్' కథను మొదట నాగ చైతన్యకు వినిపించాడట దర్శకుడు పరుశురామ్‌. మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా తరువాత నాగ చైతన్యతో పరుశురామ్‌ ఓ సినిమా ప్లాన్ చేశాడు.

కథ కూడా లాక్ చేసి సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న తరుణంలో సడన్‌గా నాగ చైతన్యతో సినిమాను పరుశురామ్‌ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఈ వెంటనే విజయ్ దేవరకొండతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. పరుశురామ్‌‌తో సినిమా గురించి నాగ చైతన్యను ప్రశ్నించగా, అతను గురించి నన్ను అడక్కండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. పరుశురామ్‌ గురించి మాట్లాడటం టైమ్ వేస్ట్ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

Vijay Devarakonda s movie flop those two are celebrating

అతను నా టైంను వేస్ట్ చేశారని చైతు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. చైతన్యతో చేయాల్సిన సినిమాను విజయ్ దేవరకొండతో చేయడం ..ఆ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో నాగ చైతన్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. గీతాగోవిందం సినిమా తర్వాత పరశురాంతో మరో మూవీ ప్లాన్ చేశారు నిర్మాత అల్లు అరవింద్. నాగ చైతన్యను హీరోగా కూడా ప్రకటించారు. అంతా ఫిక్స్ అయ్యాక పరశురాం దిల్ రాజుకు ఈ కథను వినిపించడంతో అతను దిల్ రాజు బ్యానర్‌కు షిప్ట్ అయ్యాడు.

Vijay Devarakonda s movie flop those two are celebrating

రెమ్యునరేషన్ ఎక్కువ ఆఫర్ చేయడంతోనే పరశురాం ఇలా బ్యానర్ మారిపోయారనే మాటలు అప్పట్లో తెర మీదకు వచ్చాయి. ఆ కథనే పరశురాం విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌గా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో అల్లు అరవింద్ - నాగచైతన్య ఫుల్ ఖుషి అవుతున్నారట . తనను కాదని వేరే హీరోతో తీసిన సినిమా ఫ్లాప్ అవడంతో నాగచైతన్య తనను అవమానించి వేరే ప్రొడ్యూసర్ తో సినిమాకు కమిట్ అయినందుకు అల్లు అరవింద్ ఇద్దరూ కూడా పండగ చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+