ఇప్పటివరకు ఎవరూ చేయని పవర్ ఫుల్ రోల్ లో టాలీవుడ్ స్టార్ హీరో..!!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న అప్ కమింగ్ మూవీ.. VD14. ది లెజెండ్ ఆఫ్ ద కర్స్డ్ ల్యాండ్ అనేది ట్యాగ్ లైన్. ఇది వర్కింగ్ టైటిల్. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా ఈ నిర్మిస్తోన్నాయి. నవీన్ యెర్నేని, వై రవిశంకర్, గుల్షన్ కుమార్- భూషణ్ కుమార్ నిర్మాతలు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఈ ఏడాది చివరిలో విడుదల కానుంది. 1854-1878 బ్రిటీష్ వలస పాలన నేపథ్యంలో చిత్రీకరణ జరుపుకొంటోంది.
చారిత్రక ఘట్టాలు, హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో ఉండబోతోన్నాయి. ఇందులో ఓ మొరటు పల్లెటూరి యోగి/యోధుడిగా నటిస్తోన్నాడు విజయ్ దేవరకొండ. అతని సరసన రష్మిక మందన్న కథానాయికగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'ది మమ్మీ' ఫేమ్ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ బ్రిటీష్ అధికారిగా విలన్ క్యారెక్టర్ ను పోషిస్తోన్నాడు. 2018లో విడుదలైన హారర్ థ్రిల్లర్ టాక్సీవాలా తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యన్- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తోందీ మూవీ.

పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, కర్నూలు సహా పలు ప్రాంతాల్లో జరుగనుంది. అ సినిమా లో వర్కింగ్ టైటిల్, స్టిల్.. ఇదివరకే విడుదల అయింది. విజయ్ దేవరకొండ 36వ పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది మే 9వ తేదీన వర్కింగ్ టైటిల్, స్టిల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓ యోగి చిత్రపటం ముందు నిష్ఠతో ధ్యానం చేస్తోన్న స్థితిలో ఈ ఫొటోలో కనిపించాడు విజయ్ దేవరకొండ.
26.1.26.
— Mythri Movie Makers (@MythriOfficial) January 24, 2026
Remember the date🔥
You will remember the name❤️🔥#VD14@TheDeverakonda @Rahul_Sankrityn @MythriOfficial #NiravShah #BhushanKumar #KrishanKumar @TSeries #ShivChanana @neerajkalyan_24 @vd14thefilm pic.twitter.com/07HL8UJqth
ఇప్పుడీ సినిమాపై మరో తాజా సమాచారం వెలువడింది. ఈ నెల 26వ తేదీన సోమవారం దీని టైటిల్ అనౌన్స్ కానుంది. ఈ విషయాన్ని చిత్రం యూనిట్ తాజాగా వెల్లడించింది. దీనికి సంబంధించిన పోస్టర్ విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని టైటిల్ విడుదల కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బ్రిటీష్ వలస పాలన నేపథ్యంలోనే ఈ సినిమా తెరకెక్కుతోన్నట్లు యూనిట్ చెప్పకనే చెప్పినట్టయింది. గ్రామీణ నేపథ్యాన్ని చూపించారీ పోస్టర్ లో.
-
12 రోజుల్లో రూ.1400 కోట్లు.. చరిత్ర తిరగరాసిన ‘ధురంధర్2’ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్! -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా












Click it and Unblock the Notifications