సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి?
వివాహం తర్వాత నేషనల్ క్రష్ రష్మిక మందన్న జరుపుకుంటున్న మొదటి బర్త్‌డే కావడంతో ఆమె అభిమానులతో పాటు సినీ వర్గాల్లోనూ ఈ వేడుకలు ప్రత్యేకంగా నిలిచాయి. ఈ సందర్భాన్ని మరింత గుర్తుండిపోయేలా చేస్తూ ఆమె భర్త, టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదకిగా పంచుకున్న శుభాకాంక్షలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. "ఐ లవ్ యూ జయమ్మ" అంటూ విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
భార్య రష్మికకు విజయ్ స్పెషల్ విషెస్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన అధికారిక ఖాతాలో ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ రష్మిక మందన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం "రణబాలి"కి సంబంధించిన క్రేజీ అప్‌డేట్‌ను కూడా మోసుకొచ్చింది. ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న 'జయమ్మ' పాత్రకు సంబంధించిన మేకింగ్ విజువల్స్‌ను ఈ వీడియోలో పొందుపరిచారు. రష్మిక పాత్రకు సంబంధించి ఆహార్యం, ఆమె ధరించిన సాంప్రదాయ నగలు, మేకప్, ఆ పాత్రకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని ఈ వీడియోలో క్లుప్తంగా చూపించారు.

జయమ్మపై రౌడీ ప్రేమ
విజయ్ దేవరకొండ తన పోస్టులో రష్మిక మందన్నను 'జయమ్మ' అని సంబోధించడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. "రణబాలి" చిత్రంలో ఆమె పోషిస్తున్న పాత్రపేరు జయమ్మ కావడం ఆ పాత్రలో రష్మిక ఎంతో గంభీరంగా, పవర్ ఫుల్ గా కనిపిస్తుండటంతో విజయ్ దేవరకొండ ఈ పేరును ఎంచుకున్నారు. నిజజీవితంలో భార్యాభర్తలుగా మారిన తర్వాత వెండితెరపై కూడా వీరిద్దరూ కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సినిమాల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం.
ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన ఈ జంట, తమ వృత్తిపరమైన జీవితంలోనూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారు. రష్మిక పుట్టినరోజున విజయ్ అందించిన ఈ 'జయమ్మ' సర్ ప్రైజ్ చూస్తుంటే, 'రణబాలి' చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయమనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో ఉండగా.. "బెస్ట్ కపుల్ గోల్స్" అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications