పవన్ కల్యాణ్ ''ఖుషి'' సినిమాపై నోరు జారిన హీరోయిన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఖుషి సినిమా గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. పవన్ కల్యాణ్ కెరీర్‌తో బ్లాక్ బాస్టర్ హిట్‌గా ఖుషి సినిమా నిలిచింది. అంతేకాకుండా అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఖుషి బ్రేక్ చేసింది. ఈ సినిమాతో పవన్ కల్యాణ్ మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.ఖుషి సినిమాకు సపరేటు ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాలో భూమిక హీరోయిన్‌గా నటించగా, ఎస్.జే సూర్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా గురించి కామెంట్స్ చేసి చిక్కుల్లో పడింది హీరోయిన్ ప్రియాంక మోహన్. తమిళ ఇండస్ట్రీలో ప్రియాంక మోహన్ సూపర్ క్రేజ్ ఉంది. డాక్టర్, డాన్, ఈతర్క్కుమ్ తునింధవన్ చిత్రాలతో కోలీవుడ్‌లో ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది.నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చింది. సరిపోదా శనివారం సినిమాతో మరోసారి నానితో జత కట్టింది అమ్మడు.

ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక మోహన్ మాట్లాడిన పెద్ద మాటలు వివాదంగా మారాయి. సరిపోదా శనివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. నేను సూర్య సర్ తో తమిళంలో డాన్ చిత్రంలో నటించాను. ఇప్పుడు సరిపోదా శనివారంలో నటిస్తున్నాను. అయితే ఫ్యాన్స్ అందరి తరుపున నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారు ? చేస్తే ఖుషి 2 చేయండి.. అది పవన్ కళ్యాణ్ కళ్యాణ్‌తో మాత్రమే చేయండి.
ఎందుకంటే ఖుషి 2 చితం ఒక క్లాసిక్ అంటూ అభివర్ణించింది. అయితే ప్రియాంక కామెంట్స్‌పై విజయ్ ఫ్యాన్స్ తప్పు పడుతున్నారు. ఖుషి చిత్రాన్ని తమిళం నుంచి తెలుగులో రీమేక్ చేశారు. ఖుషి 2 చేస్తే విజయ్‌తో చేయాలి కానీ పవన్ కళ్యాణ్‌తో చేయమని చెప్పడం ఏంటని విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయంలో ప్రియాంక మోహన్‌ను విజయ్ అభిమానులు ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications