'రణబాలి' రిజల్ట్ తర్వాత విజయ్ దేవరకొండ షాకింగ్ నిర్ణయం.. ఇకపై..
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబోలో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం 'రణబాలి' ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 16 న విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. పండగ సీజన్ కావడంతో 'రణబాలి' మూవీ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ చిత్రాన్ని టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన రాహుల్ సాంకృత్యాన్ అద్భుతంగా తెరకెక్కించారు.
విజయ్- రాహుల్ కాంబోలో గతంలో వచ్చిన టాక్సీవాలా మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూవీపై రిలీజ్ కు ముందు భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా రిలీజ్ అయ్యాక అందుకు తగినట్టుగానే సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు రాహుల్ సాంకృత్యాన్. ఆయన టేకింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక రణబాలి మూవీలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి గా విశ్వరూపం ప్రదర్శించారు. స్క్రీన్ పై విజయ్ కాకుండా రణబాలి కనిపిస్తారు. అంతలా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు విజయ్ దేవరకొండ.
అలాగే రణబాలి మూవీలో జయమ్మ పాత్రలో జీవించింది రష్మిక. రణబాలి భార్యగా ఆమె హావభావాలు సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇక విజయ్- రష్మిక వివాహం జరిగిన తర్వాత తొలిసారి వీరిద్దరూ స్క్రీన్ పై సందడి చేసిన సినిమా ఇదే కావడం విశేషం. స్క్రీన్ పై వీరిద్దరి కెమిస్ట్రీ అద్దిరిపోయిందనే చెప్పాలి. 1870 కాలంలో బ్రిటిష్ కాలంలో ఏర్పడిన కరవును ప్రధానంగా తీసుకుని దాని చుట్టూ ఓ వీరుడి కథను అద్భుతంగా అల్లాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్. మొత్తానికి రణబాలి సినిమాతో విజయ్ ఫుల్ ఫామ్ లోకి వచ్చినట్లు స్పష్టమైంది. అయితే అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి సినిమాలతో ఇప్పటికే యూత్ కు బాగా దగ్గరైన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన తదుపరి సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నట్లు అర్థం అవుతోంది. ఇప్పటికే రౌడీ జనార్థన మూవీతో పాటు శౌర్యవ్ తీస్తున్న సినిమాలోనూ భారీగానే యాక్షన్ ఉంది.

అయితే ఆ సినిమాల తర్వాత ఫ్యామిలీ డైరెక్టర్ విక్రమ్. కే కుమార్ తో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర కావాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు విక్రమ్ కే కుమార్ గతంలో మనం, ఇష్క్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications
