1948 తర్వాత తొలిసారి.. 400 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన క్రికెటర్!

దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. దిమాపూర్‌లో నాగాలాండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ప్లేట్ గ్రూప్ మ్యాచ్‍‌లో మిజోరం బ్యాటర్ చిన్మయ్ సుతార్ కొండంత లక్ష్యాన్ని నిర్మించడమే కాకుండా రికార్డుల సునామీ సృష్టించాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన మిజోరం జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 581/9 వద్ద డిక్లేర్ చేసింది. దీనికి ప్రధాన కారణం చిన్మయ్ సుతార్ సాధించిన క్వాడ్రపుల్ సెంచరీ(400 పరుగులు) రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 400 పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా ఆయన చరిత్ర పుటల్లోకెక్కాడు.

ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!
ముంచెత్తిన వాన: నాలుగేళ్ల నిరీక్షణ నీటిపాలు!

78 ఏళ్ల తర్వాత..
రంజీ ట్రోఫీ చరిత్రలో 400 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడు మహారాష్ట్రకు చెందిన బీబీ నింబాల్కర్. ఆయన 1948లో పుణెపై నాటౌట్ గా 443 రన్స్ చేసి అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు అంటే దాదాపు 78 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో 400 పరుగులు సాధించిన ఘనతను చిన్మయ్ సుతార్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆయన రంజీల్లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచారు. మూడో స్థానంలో పృథ్వీ షా(379 రన్స్-అస్సాంపై), నాలుగో స్థానంలో సంజయ్ మంజ్రేకర్(366 రన్స్-హైదరాబాద్‌పై), ఐదో స్థానంలో ఎంవీ శ్రీధర్(344 రన్స్-ఆంధ్రాపై) ఉన్నారు.

Mizoram Cricketer Chinmay Sutar Hits Historic 400 in Ranji Trophy First Player Since 1948

ప్రపంచ రికార్డుల జాబితాలో స్థానం
ప్రపంచ ఫస్ట్-క్లాస్ క్రికెట్ చరిత్ర పరిశీలిస్తే.. ఒకే ఇన్నింగ్స్ లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 10వ ఆటగాడిగా చిన్మయ్ సుతార్ ఘనత సాధించాడు. బ్రియాన్ లారా(501*-అత్యధికం), డాన్ బ్రాడ్‌మాన్ వంటి దిగ్గజాల సరసన ఆయన చోటు దక్కించుకున్నారు. చిన్మయ్ సుతార్ తన మారథాన్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 46 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. మిజోరం జట్టులో చిన్మయ్ సుతార్ 400 పరుగుల విధ్వంసానికి తోడు జెహూ ఆండర్సన్(69 పరుగులు) రాణించడంతో ఆ జట్టు 581 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.

తీరని విండీస్ 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఐదో టీ20 మ్యాచ్ రద్దు!
తీరని విండీస్ 24 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. ఐదో టీ20 మ్యాచ్ రద్దు!

సాధారణ అరంగేట్లం నుంచి సంచలన రికార్డు వరకు..
చిన్మయ్ సుతార్ క్రికెట్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ ఏడాది జనవరిలో ముంబై తరఫున విజయ్ హజారే ట్రోఫీ ద్వారా లిస్ట్-ఏ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆయన.. తొలి మ్యాచ్‌లో కేవలం 2 పరుగులకే రనౌట్ అయ్యాడు. అయితే ఈ నెల ప్రారంభంలో మిజోరం జట్టులోకి మారి ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. మణిపూర్‌తో జరిగిన తొలి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 99 పరుగులతో మెరిసిన చిన్మయ్ సుతార్.. ఇప్పుడు ఏకంగా ఏకంగా 400 పరుగుల రికార్డు ఇన్నింగ్స్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+