ఇరాన్ తో యుద్ధం ముగిసినట్లు ట్రంప్ ప్రకటన- మొన్నటి ఓటమి సెగ

ఇరాన్‌తో ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ జసిమ్ అల్ థానీతో వైట్ హౌస్‌లోని బ్రీఫింగ్ రూమ్‌లో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఇరాన్‌పై సైనిక దాడులు కొనసాగించాల్సిన అవసరం కనిపించట్లేదని, తమ బలగాలు అక్కడ యథాతథ స్థితిని కొనసాగిస్తున్నాయని ట్రంప్ స్పష్టం చేశారు.

తాము చేపట్టిన సైనిక చర్యల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతిన్నదని, మిలిటరీపరంగా ఆ దేశం మళ్లీ కోలుకునే స్థితిలో లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ అణు కార్యక్రమాలను శాశ్వతంగా నిరోధించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా అణు ముప్పును పూర్తిగా నివారించి, మధ్య ప్రాచ్యంలో శాశ్వత స్థిరత్వాన్ని సాధించడానికి కృషి చేస్తోన్నామని వెల్లడించారు.

Donald Trump declared the war against Iran was militarily effectively over and US is stepping back

ఖతార్ ప్రధానితో జరిగిన సమావేశం వివరాలను డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. నౌకాదళ దిగ్బంధం, ఆపరేషన్ ఐరన్ గేట్‌ను ఇలాగే కొనసాగించడానికి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఖతార్‌తో పాటు ఇతర మిత్రదేశాలు కూడా పూర్తి అంగీకారం తెలిపాయని అన్నారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను పొందకూడదనే విషయంలో ఆయా గల్ఫ్ దేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని ట్రంప్ తేల్చిచెప్పారు.

కార్తీకమాసం మొదటి సోమవారం ఎప్పుడు
కార్తీకమాసం మొదటి సోమవారం ఎప్పుడు

ప్రస్తుతానికి సైనిక చర్యలు నిలిపివేసినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితి మారితే మళ్లీ దాడులు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ ఇరాన్‌తో చర్చలు విఫలమైతే దాడులు పునరుద్ధరించే అవకాశాలను పరిశీలిస్తామని అన్నారు. ఇజ్రాయెల్‌తో పాటు మొత్తం మధ్య ప్రాచ్య ప్రాంతం ప్రస్తుతం ఇరాన్ ముప్పు నుంచి సురక్షితంగా ఉందని, వివాద పరిష్కారానికి సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం
పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఇటీవల ముగిసిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఈ విదేశాంగ విధాన మార్పుపై తీవ్ర ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు. ఇరాన్‌తో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిపోయాయి. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడటంతో స్థానిక ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

ఫలితంగా ఆ దేశంలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు యూఎస్ కాంగ్రెస్‌లో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. సెనెట్, హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ డెమోక్రాట్ల పట్టు బిగిసింది. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఓటమి నేపథ్యంలోనే ట్రంప్ ఇరాన్‌పై మిలిటరీ దాడులను నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+