శ్రీశైలం, అహోబిలానికి బెస్ట్ అవార్డులు! ఏపీ ఆధ్యాత్మిక వైభవానికి జేజేలు

ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక ఘనత మళ్లీ దేశవ్యాప్తంగా మారుమోగింది. మన శిల్పకళా వైభవానికి, శతాబ్దాలనాటి సంస్కృతికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రసిద్ధ పత్రిక 'ది వీక్' నిర్వహించిన హెరిటేజ్ అవార్డ్స్ - 2026 పోటీలలో ఏపీలోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, అహోబిలం దేవస్థానాలు సిల్వర్ అవార్డులను కైవసం చేసుకున్నాయి.

ఏ క్షేత్రానికి ఏ అవార్డు లభించిందంటే..

భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీశైలం దేవస్థానానికి 'స్పిరిచువల్ టూరిజం' (ఆధ్యాత్మిక పర్యాటకం) విభాగంలో సిల్వర్ అవార్డు దక్కింది. అలాగే ప్రకృతి ఒడిలో భాసిల్లుతూ, పర్యావరణ పరిరక్షణతో కూడిన పర్యాటకాన్ని అందిస్తున్న అహోబిలం దేవస్థానానికి 'సస్టైనబుల్ టూరిజం' విభాగంలో ఈ పురస్కారం లభించింది.

Srisailam and Ahobilam Temples Win Prestige Silver Awards at The Week Heritage Awards 2026 for AP Tourism
కార్తీక మాసం వేళ శ్రీశైలం భక్తులకు బిగ్ అప్డేట్ - దర్శనం, సేవల్లో కీలక మార్పులు..!!
కార్తీక మాసం వేళ శ్రీశైలం భక్తులకు బిగ్ అప్డేట్ - దర్శనం, సేవల్లో కీలక మార్పులు..!!

రాష్ట్రప్రజలకు దేవాదాయ శాఖ మంత్రి శుభాకాంక్షలు

రాష్ట్రానికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు రావడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. ఈ శుభసందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాలలోని భక్తులకు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్న దేవాదాయ శాఖ అధికారులకు, ఆలయ సిబ్బందికి ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్!
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్!

మన సంస్కృతికి సజీవ సాక్ష్యాలు మన ఆలయాలు

ఆంధ్రప్రదేశ్ అనంతమైన ఆధ్యాత్మికతకు, ప్రాచీన ఆలయ సంప్రదాయాలకు, అద్భుత శిల్పకళకు నిలయమని మంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. మన రాష్ట్రంలోని పురాతన దేవాలయాలు కేవలం పూజా పునస్కారాలకే పరిమితం కాకుండా, భారతీయ సంస్కృతి, చరిత్ర, పూర్వీకుల పద్ధతులకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ జాతీయ స్థాయి గుర్తింపుతో ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ పేరు దేశ పటంలో మరింత ప్రకాశిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+