పండగ సీజన్ ఎఫెక్ట్- బంగారం ధరల్లో మరో తగ్గుదల

అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా పసిడి, వెండి ధరల్లో ఒడుదొడుకులు నమోదవుతున్నాయి. బంగారం ధరల్లో తగ్గుదల కొనసాగుతోంది. దేశంలో ధన్ తెరాస్, దీపావళి పండుగల కొనుగోళ్ల తర్వాత బంగారం ధరలు మరోసారి తగ్గుదలను నమోదు చేసుకున్నాయి. సోమవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 490 మేర తగ్గింది.

ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన బెంచ్ మార్క్ రేట్ల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర 1,43,1400 రూపాయల వద్ద రికార్డయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 1,31,212 రూపాయల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌లో పసిడి రేట్లు స్థిరంగా ఉండటంతో నాణేలు, లైట్‌వెయిట్ జ్యువెలరీ సెట్లు, విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలకు డిమాండ్ బాగా పెరిగింది.

Gold and silver prices declined at MCX as 24K 22K and 18K following buying during festive period

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,110 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,32,250 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,44,110 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,39,910, రూ.1,32,022 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,44,129, 22 క్యారెట్లు రూ. 1,32,022 వద్ద కొనసాగుతున్నాయి.

పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం
పవన్ కల్యాణ్ విడాకులపై రెండేళ్ల కిందటే వేణు స్వామి జోస్యం

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,105, 18 క్యారెట్లు - రూ. 10,823

ముంబై..

24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 14,411, 22 క్యారెట్లు - రూ. 13,210, 18 క్యారెట్లు - రూ. 10,808

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+