దసరా స్పెషల్ మటన్ కర్రీ.. ఇలా చేస్తే తినేవాళ్లకు పండుగే!
దసరా పండుగ అంటేనే ఇంట్లో పండుగ స్పెషల్ వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా మాంసాహారం ఇష్టపడే కుటుంబాల్లో మటన్ కర్రీ లేకుండా పండుగ భోజనం పూర్తి కాదు. సాధారణ మటన్ కర్రీ కాకుండా దసరా స్పెషల్‌గా కాస్త ఎక్కువ మసాలాలు, కాస్త ఎక్కువ కారం, రిచ్ గ్రేవీతో చేస్తే తినేవాళ్లకు నిజంగా పండుగే అనిపిస్తుంది. ఈ రోజు దసరా స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం.
కావాల్సిన పదార్ధాలు
మటన్ - ఒక కేజీ
ఉల్లిపాయలు - కట్ చేసుకున్నవి రెండు
పచ్చి మిరపకాయలు - 4
పసుపు - అర స్పూన్
ఉప్పు - 2 స్పూన్స్
కారం -2 స్పూన్స్
గరం మసాలా - ఒక స్పూన్
నూనె - 2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర - కొద్దిగా
ధనియాల పొడి - ఒక స్పూన్

తయారీ విధానం
ముందుగా మంచి నాణ్యత గల మటన్ తీసుకోవాలి. ఎముకలతో కూడిన మాంసం తీసుకుంటే రుచి ఎక్కువగా వస్తుంది. సుమారు ఒక కిలో మటన్‌ను బాగా కడగాలి. వంట సమయంలో ముందుగా ప్రెజర్ కుక్కర్‌లో కొద్దిగా నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు బాగా మెత్తబడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆపై అందులో మటన్ వేసి బాగా కలిపి ఉడికించాలి.
అందులో అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసి, దసరా స్పెషల్ కాబట్టి కాస్త ఎక్కువ గరం మసాలా వేస్తే వాసన బాగా వస్తుంది. లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, యాలుకలు కలిపి చేసిన పొడిని మసాలాగా వెయ్యాలి. మటన్ లో ఒక స్పూన్ గరం మసాలా వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి ఆరు విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి.
ప్రెజర్ దిగిన తర్వాత మూత తెరిచి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మటన్ కూరలో ఒక స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర వేసి ఉడికించాలి. కుక్కర్ లో వండిన మటన్ మళ్ళీ స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టకుండా ఉడికించటం వలన గ్రేవీకి చిక్కదనం వస్తుంది. దసరా సమయంలో ఈ మటన్ కర్రీని గారెలు, పూరీ లేదా బగారా అన్నంతో కలిపి తింటే రుచి మరోలా ఉంటుంది.
పండుగ రోజున ఇలాంటి స్పెషల్ మటన్ కర్రీ చేస్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అతిథులు వచ్చినా చాలా ఇష్టంగా తింటారు. మిగిలిపోతే మరుసటి రోజు కూడా రుచి అంతే బాగుంటుంది. దసరా పండుగను మరింత ప్రత్యేకంగా చేసుకోవాలంటే ఈ మటన్ కర్రీని తప్పక ప్రయత్నించండి.













Click it and Unblock the Notifications
