ప్రభాస్ ఫౌజీ లీక్డ్ ఫోటో! 1940ల బ్యాక్‌డ్రాప్‌లో విధ్వంసం
టాలీవుడ్ సెన్సేషన్, రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ తన అసలైన రూపంతో వెండితెరపై మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 'రాజా సాబ్' తర్వాత తన తదుపరి చిత్రం .. ఫౌజీపై వస్తున్న అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది తాజాగా బయటకు వచ్చిన ఒక 'లీక్డ్' ఫోటో. 'సీతారామం'తో మనసులను గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియడ్ డ్రామాలో ప్రభాస్ లుక్ చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, లుక్స్‌పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడిచాయి. వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ, 1940వ దశకం నాటి రెట్రో స్టైల్‌లో ప్రభాస్ మెరిసిపోతున్నారు. గుబురు మీసం, క్లాస్ హెయిర్ స్టైల్‌తో ఉన్న ఈ ఫోటో చూస్తుంటే ప్రభాస్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'మిర్చి' కాలం నాటి ఆకర్షణ మళ్లీ కనిపిస్తోందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. "డార్లింగ్ ఈజ్ బ్యాక్" అంటూ నెట్టింట ఈ ఫోటో రికార్డులు సృష్టిస్తోంది.

మేకర్స్ హెచ్చరిక.. అంచనాల పర్వం
సినిమాలోని అతి ముఖ్యమైన లుక్ ఇలా లీక్ అవ్వడంపై చిత్ర యూనిట్ తీవ్రంగా స్పందించింది. హను రాఘవపూడి నేతృత్వంలోని టీమ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అనుమతి లేకుండా కంటెంట్‌ను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇవ్వాలని తాము పడుతున్న శ్రమను ఇలాంటి లీకులు దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద తెరపైనే ఈ విజువల్స్ చూడాలని దర్శకుడు స్వయంగా విజ్ఞప్తి చేశారు.
నెగటివిటీకి చెక్.. హైప్ షురూ!
విచిత్రమేమిటంటే, ఈ లీక్ చిత్ర యూనిట్‌కు కొంత అసంతృప్తిని మిగిల్చినా, సినిమాకు మాత్రం భారీ మైలేజీని తెచ్చిపెట్టింది. ప్రభాస్ రూపంపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ, ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక బలమైన కమ్‌బ్యాక్ అవుతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హను రాఘవపూడి మార్క్ ఎమోషన్స్, ప్రభాస్ మాస్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవ్వడం ఖాయమని స్పష్టమవుతోంది












Click it and Unblock the Notifications