విశ్వక్ సేన్ ‘కల్ట్’ విధ్వంసం షురూ.. ట్రైలర్‌తో అంచనాలు డబుల్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన డార్క్ థ్రిల్లర్ సినిమా 'కల్ట్'. ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఒక్క రోజు ముందు మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన టీజర్‌తో పోలిస్తే ట్రైలర్ భిన్నమైన వైబ్ అందిస్తోంది. కేవలం పార్టీ వాతావరణం, కాన్సెప్టుపైనే కాకుండా స్టోరీలో కీలకమైన డీఎస్పీ సంకల్ప్ నాయక్ పాత్రపై ఎక్కువగా దృష్టి సారించారు. గోవాలో స్థానికేతరులపై జరుగుతున్న వేధింపులను అడ్డుకునే బలమైన ఆశయం ఉన్న పోలీస్ అధికారిగా సంకల్ప్ నాయక్ పాత్రను తీర్చిదిద్దారు.

'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!
'ఇరుముడి' దర్శకుడితో బాలయ్య పవర్ ఫుల్ సినిమా..!

విశ్వక్ సేన్ మల్టీ టాస్కింగ్.. సాలిడ్ యాక్షన్
ఈ చిత్రం విశ్వక్ సేన్‌కు చాలా ప్రత్యేకమైనది. కేవలం కథానాయకుడిగానే కాకుండా.. ఈ సినిమాకు ఆయనే స్వయంగా స్టోరీ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహించారు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీక్వెన్సులు విశ్వక్ సేన్ పాత్రలోని ఆగ్రహాన్ని తీవ్రతను ప్రతిబింబించేలా సాగాయి. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో విశ్వక్ సేన్ ఈ సారి ఓ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టునట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

Vishwaksen CULT Release Trailer Out Dark Thriller Promises High-Octane Action Highlights intense Storyline
నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!
నాటు నాటు సింగర్‌తో సెన్సేషన్.. డెబ్యూ సినిమాకే ఇంటర్నేషనల్ ప్రమోషన్స్!

సాంకేతిక బలం
సినిమా మూడ్‌కు తగ్గట్లుగా సాంకేతిక బృందం అందించిన పనితనం ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ను చాలా డార్క్‌గా, క్రిస్పీగా చూపించగా.. రవి బస్రూర్ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు కావాల్సిన తీవ్రతను చేకూర్చింది. తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ ఓరియంటెడ్‌గా సాగిన ఈ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+