విజయ్, ప్రభాస్ రికార్డులు బద్దలు.. ఓటీటీలో సూర్య సినిమా సెన్సేషన్!

Vishwanath And Sons OTT: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామా థియేటర్లలో భారీ విజయం సాధించింది. అనంతరం సెప్టెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ థియేటర్ రన్‌లోనే కాదు.. ఓటీటీలోనూ తన సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ముఖ్యంగా దళపతి విజయ్, ప్రభాస్ సినిమాల వ్యూస్‌ను అధిగమిస్తూ సూర్య మూవీ సరికొత్త రికార్డు సృష్టించింది.ఇంతకీ ఆ రికార్డులు ఏంటీ?

వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!
వారం తిరక్కముందే బిగ్ బాస్ లో మరో షాకింగ్ ఎలిమినేషన్: ట్విస్ట్ అద్దిరింది.. !!

తొలి వారంలో 5.5 మిలియన్ వ్యూస్
'విశ్వనాథ్ అండ్ సన్స్' తొలి వారంలోనే రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ సినిమా తొలి వారం (సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు)లోనే 5.5 మిలియన్ వ్యూస్ సాధించింది. మొత్తం 14.6 మిలియన్ వ్యూయింగ్ అవర్స్ నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ నాన్-ఇంగ్లిష్ మూవీస్ ట్రెండింగ్ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ రికార్డు బట్టి చూస్తే ఈ సినిమాకు ఇండియాలోనే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది.

Vishwanath And Sons OTT Suriya Breaks Vijay Prabhas Records With 5 5M Views

సౌత్ సినిమాల్లో నంబర్ వన్
5.5 మిలియన్ వ్యూస్‌తో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. 2026లో థియేటర్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన సౌత్ ఇండియన్ సినిమాల ఫస్ట్ వీక్ వ్యూయర్‌షిప్‌లో టాప్ లో నిలిచింది. అంతకుముందు విజయ్ మూవీ బ్లాస్ (Blast) 4.4 మిలియన్ వ్యూస్‌తో టాప్ ఉండగా.. సూర్య సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది. కరా (Kara)3.8 మిలియన్, జననాయగన్ (Jana Nayagan) 3.6 మిలియన్, ప్రభాస్ 'రాజాసాబ్ (The Raja Saab) 3.4 మిలియన్ వ్యూస్‌తో తదుపరి స్థానాల్లో నిలిచాయి. అంటే సూర్య సినిమా థియేటర్లలో సాధించిన విజయాన్ని ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా కొనసాగించిందని చెప్పొచ్చు.

బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు
బిగ్ బాస్ లో ఫస్ట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్- కుర్రాడ్ని మిడ్ వీక్ లోనే పంపించారు

ఆల్‌టైమ్ రికార్డు
ఇదే సమయంలో మరో రికార్డు నమోదైంది. నెట్‌ఫ్లిక్స్‌లో థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్‌కు వచ్చిన సౌత్ ఇండియన్ సినిమాల ఆల్‌టైమ్ ఫస్ట్ వీక్ వ్యూయర్‌షిప్‌లో 'విశ్వనాథ్ అండ్ సన్స్' 5.5 మిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) 5.8 మిలియన్ వ్యూస్‌తో మొదటిస్థానంలో ఉండగా.. ఆ తర్వాత 'విశ్వనాథ్ అండ్ సన్స్' 5.5 మిలియన్‌తో నిలిచింది. ఇడ్లీ కాడాయి (Idli Kadai) 5.2 మిలియన్, లక్కీ భాస్కర్ (Lucky Baskhar) 5.1 మిలియన్, బాస్ట్ (Blast) 4.4 మిలియన్ వ్యూస్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంటే కేవలం 2026లోనే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్ సినిమాల డిజిటల్ వ్యూస్‌లో కూడా కూడా సూర్య మూవీ టాప్‌లో నిలిచిందన్నమాట.

 105 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో 'టాక్సిక్’ సరికొత్త చెత్త రికార్డు
105 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో 'టాక్సిక్’ సరికొత్త చెత్త రికార్డు

14 దేశాల్లో టాప్ 10 ట్రెండింగ్
ఇక సూర్య మూవీకి అంతర్జాతీయంగా కూడా మంచి ఆదరణ లభిస్తోంది. 14 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. బహ్రెయిన్, శ్రీలంక, భారత్, యూఏఈ వంటి దేశాల్లో టాప్ స్థానంలో నిలిచినట్టు నెట్ ఫిక్స్ తెలిపింది. ఇది సూర్య సినిమాకు ఉన్న మార్కెట్‌ను మరోసారి చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగు, తమిళం అనే రెండు ప్రధాన మార్కెట్లతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల కావడంతో ఈ సినిమా ఈ రేంజ్‌లో గ్లోబల్ రీచ్ అందుకుందని చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+