ముందు అల్లు అర్జున్.. వెనక వెంకటేష్.. మధ్యలో త్రివిక్రమ్

మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న రచయిత, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పరిచయం అవసరంలేదు. కొన్ని దశాబ్దాల నుంచి తెలుగు ప్రేక్షకులను తన మాటలద్వారా, దర్శకత్వ ప్రతిభ ద్వారా అలరిస్తున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాను దర్శకత్వం వహించిన గుంటూరు కారం మొదటిరోజు మొదటి ఆట నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో గురూజీ దర్శకత్వ ప్రతిభపై మరక పడింది.

సినిమా భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి ఉన్నప్పటికీ ఇందులో మహేష్ బాబు నటన, డాన్స్ లతోపాటు కుటుంబ ప్రేక్షకులంతా ప్రిన్స్ కోసం థియేటర్లకు తరలిరావడంతో బ్రేక్ ఈవెన్ కు దగ్గరలో ఉంది. రాబోయే మూడు నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకాన్ని నిర్మాత వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు ఇప్పటికీ టీవీల్లో వస్తుంటే ప్రేక్షకులంతా చాలా ఆనందిస్తుంటారు. అయితే గుంటూరు కారం టీవీల్లో వస్తే అలాంటి ఎంజాయ్ మెంట్ కూడా ఉండదని మహేష్ బాబు అభిమానులు మండిపడుతున్నారు.

 whats is the trivikram srinivas next project

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమా చేస్తున్నారు. తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. దీనితర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు. అట్లీతో సినిమా చేయడానికి రెండు సంవత్సరాలు పడుతుంది. ఆ తర్వాత బన్నీ ప్రయారిటీ మారొచ్చు.. మారకపోవచ్చు.. ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ సినిమాకు ముందుగా నాని-వెంకటేష్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ చేద్దామనుకుంటున్నారు. ఇప్పటివరకు త్రివిక్రమ్ స్టార్ హీరోలతోనే సినిమాలు చేసుకుంటూ వచ్చారు.

టైర్ 2 హీరోలతో సినిమా చేస్తారా? చేస్తే తన స్థాయిని తగ్గించుకున్నవారవుతారా? అనేది తేలాల్సి ఉంది. మంచి ఫామ్ లో ఉన్న హీరోలతోనే త్రివిక్రమ్ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ముందు నుయ్యి, వెనక గొయ్య అన్నట్లుగా గురూజీ పరిస్థితి తయారైందంటున్నారు. అట్లీ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. దీనికి త్రివిక్రమ్ నిర్మాతగా వ్యవహరిస్తారంటున్నారు. త్రివిక్రమ్ నుంచి భవిష్యత్తులో ఏ తరహా చిత్రం రానుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+