5 వేలతో స్టార్ట్ చేసి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..?
ఓ హీరోయిన్ తన కెరీర్‌ను రూ. వేలతో మొదలుపెట్టి, ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి చేరుకుంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు.. సాయి పల్లవి. డ్యాన్సర్‌గా రూ. 5 వేలు నుంచి హీరోయిన్‌గా రూ.5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్‌కు సాయి పల్లవి ఎదిగింది. సౌత్ ఇండస్ట్రీల్లో సాయి పల్లవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన సాయి పల్లవి మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
'ప్రేమమ్' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలక్టివ్‌గా సినిమాలను ఎంపిక చేసుకుంటూ అతి తక్కువ కాలంలోన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో అభిమానులను సాయి పల్లవి ఫిదా చేసిందనే చెప్పాలి. ఇక సాయి పల్లవి స్టెప్పులు అభిమానులతో ఈలలు వేయించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

తన తొలి తెలుగు సినిమా 'ఫిదా' నుంచి మొన్న వచ్చిన 'విరాటపర్వం' వరకు అన్ని విభిన్నిమైన పాత్రల్లోనే నటిస్తూ అభిమానులను అలరిస్తోంది.తెలుగు, తమిళ, కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి ఓ పట్టాన సినిమా ఓకే చేయదు. కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్పిస్తే ఆ సినిమాకు సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. 'అమరన్'సినిమాతో హిట్ కొట్టిన సాయి పల్లవి, తండేల్ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణంలో సీత పాత్రలో కనిపించనుంది.












Click it and Unblock the Notifications