సాయిపల్లవికి తెలుగులో ఇష్టమైన స్టార్ హీరో
సహజమైన అందంతో అలరారే సాయిపల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన వ్యక్తిత్వంతో, అభిప్రాయాలతో మహోన్నతమైన పేరును సంపాదించుకుంది. ఫిదా సినిమాతో తొలిసారిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత చేసినవి కూడా తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోందంటే అందుకు కారణం ఆమె ఎంచుకుంటున్న ప్రాజెక్టులు. చిట్టి పొట్టి బట్టలతో, రెమ్యునరేషన్ ఎక్కువ తీసుకొని నటించే హీరోయిన్ కాదు. సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి.. అంగాంగ ప్రదర్శనలు ఉండకూడదు.. ముద్దు సన్నివేశాలు అసలే ఉండకూడదు.. సాంప్రదాయాన్ని ప్రతిబింబించే వాటినే ఎంచుకొని మంచిపేరు సంపాదించింది.
వ్యక్తిత్వానికి అభిమానులు ఎక్కువ
సినిమాలో హీరోయిన్‌గా కన్నా ఆమె వ్యక్తిత్వానికే ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. చాలా సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ తెలుగులో తన అభిమాన హీరో చిరంజీవి అని చెప్పింది. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా నటించే అవకాశం వచ్చినప్పటికీ తిరస్కరించింది. అందుకు కారణం.. మొదటినుంచి చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించాలనుకుంది. చిరంజీవి పక్కన డ్యాన్స్ వేయాలనేది ఆమె కోరిక. మెగాస్టార్ పక్కన డ్యాన్స్ వేస్తూ విజిల్స్ వేయించుకోవాలనేది తన కోరిక అని చెప్పింది. అందుకే భోళాశంకర్ లో చెల్లెలి పాత్రను తిరస్కరించానని వెల్లడించింది.

విభిన్నమైన కథల ఎంపిక
పరిశ్రమలో ఉన్న మిగతా హీరోయిన్లకంటే భిన్నంగా ఉంటూ, విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సాయిపల్లవి ముందుకు సాగుతోంది. భవిష్యత్తులో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటిస్తానని చెప్పింది. తెలుగులో ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉందని తెలిపింది. హిందీలో రామాయణం సినిమాలో సీతగా నటిస్తోంది. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నారు. తన సహజమైన అందానికి, నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతారని నిస్సందేహంగా చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications