యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్...జగన్ పాత్రలో జీవా...
యాత్ర 2 ఫస్ట్ లుక్ రీలీజ్ అయ్యింది. ఈ ఫస్ట్‌లుక్‌లో జీవా, మమ్ముట్టిలను చూడొచ్చు. అయితే ఇందులో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నట్లు ఈ పోస్టర్ చూడగానే అర్థమయ్యిపోతుంది. అయితే, ఈ సినిమా 2019లో వచ్చిన యాత్ర కు సీక్వెల్.. గతంలో కూడా వైఎస్ఆర్ బయోపిక్‌గా యాత్ర సినిమాను ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చారు. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ఇప్పడు మళ్లీ 2024 ఎలక్షన్స్ ముందు యాత్ర 2 సినిమా తెరపైకి రానుంది.
వీరే కీలకం...
యాత్ర 2 సినిమాను మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోన్నారు. ఈ సినిమాలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాత్రలను చూడొచ్చు. అయితే సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోక ముందు, చనిపోయిన తర్వాత, జగన్ ఎలా సీఎం అయ్యాడు అనే దానిపై సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నిర్వహించి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా. వైఎస్ ఆర్ పాత్రలో మళయాళ స్టార్ మమ్ముట్టి నటించడం అనడం కంటే జీవించారు అని చెప్పాలి. అంతగా ఆయన ఆ పాత్రలో ఒదిగిపోయారు. ప్రస్తుతం వస్తున్న యాత్ర 2 సినిమాలో కూడా మమ్ముట్టి గారే వైఎస్ఆర్ పాత్రను పోషిస్తున్నట్లు పోస్టర్‌లో తెలిసిపోతుంది. ఇక వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ స్టార్ జీవా నటించనున్నారు.
రిలీజ్ డేట్ ప్రకటించారు. ..
అయితే ఈ రోజు రిలీజ్ చేసిన యాత్ర 2 పోస్టర్‌లో ఒవైపు మమ్ముట్టి ఉండగా... మరోవైపు జీవా ఉంటారు. నేనేవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొడుకుని అంటూ ఈ పోస్టర్‌లో రాసుకోచ్చారు. దీంతో ఈ పోస్టర్ కాస్త ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టర్‌తో పాటు ఈ చిత్రం మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.
2024 ఫిబ్రవరి 8న ఈ చిత్రం విడుదలవుతుంది. అయితే యాత్ర 2 సినిమాను 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా తీసున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 'యాత్ర' సినిమా ఫిబ్రవరి 8, 2019లో విడుదల అయ్యింది. దానికి సీక్వెల్‌గా వస్తున్న 'యాత్ర 2' సినిమాను కూడాఅదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.
-
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్‌తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్.. -
ఫైనల్ వేళ టీమిండియాకు మాజీ కోచ్ హెచ్చరిక, అభిషేక్ బ్యాటింగ్ ఆర్డర్ ఇక..!! -
మీ పాత బంగారం చెల్లుతుందా? 2026 కొత్త నిబంధనలు ఇవే! -
EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా? -
T20 world cup Final: ఫైనల్ అభిషేక్ దే-తేల్చేసిన టీమిండియా హీరో..! -
ఇరాన్ పోరాటం వెనుక రహస్య ఆయుధం? యూఎస్-ఇజ్రాయెల్ కు చిక్కని సీక్రెట్..! -
జీహెచ్ఎంసీ వాసులకు బిగ్ న్యూస్.. వారి ఆస్తులు సీజ్ కు రంగం సిద్ధం! -
ఆ ఉద్యోగుల జీతాలు నిలిపివేత, ఐఏఎస్ ల నుంచి జిల్లా స్థాయి వరకు - నిర్ణయం వెనుక..!!












Click it and Unblock the Notifications