'ది ప్యారడైజ్' నుండి తెలంగాణ ఫోక్ సాంగ్ వచ్చేసింది.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే..!
నేచురల్ స్టార్ నాని- దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ 'ది ప్యారడైజ్'.. ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సెప్టెంబర్ 24 న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఆయా షేర్ సాంగ్ కు బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తెలంగాణలో ఎంతో పాపులర్ అయిన ఫోక్ బీట్ ను పెట్టారన్న సంగతి తెలిసిందే.
తెలంగాణ లోని పెళ్లిళ్లు, వేడుకలు, దావత్ లలో డీజేల్లో ఎప్పుడూ మార్మోగే "ఏశ నాగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల.. మనం ఊగుదమే బాలా " అనే ఫోక్ పాటను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కు నాని, కీర్తి సురేశ్ తమ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఆయా షేర్ సాంగ్ సామాజిక మాధ్యమాల్లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాట కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. ప్రభా బంగరిగాళ్ల, అద్దుల జంగిరెడ్డి పాడారు. ఇక దసరా మూవీ తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ ఈ ఏడాది మార్చి 26 నే విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో ఆగస్టు 21 కి వాయిదా పడింది. అక్కడి నుంచి సెప్టెంబర్ 24 కు వాయిదా పడింది. ప్యారడైజ్ మూవీలో నానికి జోడీగా యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ నటించింది.

అలాగే సీనియర్ నటుడు మోహన్ బాబు, తనికెళ్ల భరణి, సంపూర్ణేశ్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. అనిరుధ్- నాని కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. గతంలో వీరి కాంబోలో జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు ప్యారడైజ్ మూవీ అంతకుమించి ఉండబోతుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications