అలా చేస్తే కఠిన చర్యలు - సీఈవో హెచ్చరిక..!!
ఏపీలో పోలింగ్ కు సర్వం సిద్దం అవుతోంది. ఏపీలోని 25 ఎంపీ స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకె పోలింగ్ జరగనుంది. పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికల సంఘం తుది ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇదే సమయంలో పోలింగ్ పైన జరుగుతున్న ప్రచారం పైన స్పందించిన ఎన్నికల ప్రధానాధికారి మీనా కీలక సూచనలు చేసారు.
ఏపీలో ఎన్నికల సంసిద్దత పైన సీఈవో మీనా మార్గదర్శకం చేసారు. చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందంటూ ఇటీవల ఏపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు.

చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అని.. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై మార్కు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్ళపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలనే కుట్ర జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో అవుతున్న ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు.
చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని తేల్చిచెప్పారు. మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని మీనా స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారమన్నారు.
⚠️ MISINFORMATION ALERT! ⚠️
— Chief Electoral Officer, Andhra Pradesh (@CEOAndhra) May 12, 2024
🛑 This morning false information in the form of video message from a leader of the Jana Sena Party has been spread in WhatsApp claiming that functionaries from another political party were giving out money and marking voters with indelible ink to… pic.twitter.com/O2dH0dh5OS
ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని సీఈవో ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ఇదే సమయంలో ఇప్పటికే సున్నిత ప్రాంతాలను గుర్తించిన ఎన్నికల సంఘం అవసరమైన చర్యలు చేపట్టింది. గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో..పార్టీలు అప్రమత్తం అయ్యాయి.

Fact Check
వాదన
వైసీపీ డబ్బులు పంచి ఓటర్ వేలుపై సిరా చుక్క పెడుతోంది
వాస్తవం
నాగబాబు వ్యాఖ్యలను తప్పు బట్టిన ఎన్నికల సంఘం. తప్పుడు ప్రచారం చేయొద్దన్న ఈసీ
రేటింగ్
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications