Fact Check: వాట్సాప్ గ్రూపుల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ లీక్..! ఈసీ క్లారిటీ ..!

దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి మొదలుపెట్టి విపక్షాల వరకూ అందరి చూపు ఈసీవైపే. ఈ తరుణంలో ఈసీ పేరుతో ఓ షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ తేదీ, ఫలితాలు ఇలా అన్ని తేదీలూ ఉన్నాయి. దీంతో నాలుగు రోజుల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 28 వరకూ గడువు ఇచ్చారు. అలాగే వచ్చే నెల 19న పోలింగ్ జరగబోతోంది. మే 22న కౌంటింగ్ జరిగి ఫలితాలు ప్రకటిస్తారు. మే 30న కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఈ మేరకు వచ్చిన షెడ్యూల్ పై రాజకీయ పార్టీల్లో నిజమా కాదా అనే చర్చ జరుగుతోంది.

Fact Check cec clarified on loksabha election schedule circulated on social media

దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న షెడ్యూల్ పై ఈసీ స్పందించింది. లోక్ సభ ఎన్నికల సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో ఓ ఫేస్ మెసేజ్ సర్కులేట్ అవుతోందని ఈసీ తెలిపింది.

ఇప్పటివరకూ ఈసీ ఎలాంటి ఎన్నికల తేదీల్ని ప్రకటించలేదని క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తారని స్పష్టత ఇచ్చింది. కాబట్టి ఇలాంటి వార్తలు నమ్మాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పేసింది. వాస్తవానికి ఈ నెల 13 లేదా 14వ తేదీల్లో షెడ్యూల్ విడుదలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇలా నకిలీ తెరపైకి వచ్చింది.

Fact Check

వాదన

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

వాస్తవం

సోషల్ మీడియాలో వైరల్ అయిన షెడ్యూల్ నకిలీదని తేల్చిన ఈసీ

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+