Fact Check: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ? హిందూపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. సాధారణంగానే ఎన్నికల సమయంలో జరిగే పార్టీ మార్పులు, అసంతృప్తులు అక్కడక్కడా మొదలయ్యాయి కూడా. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీతో పాటు విపక్ష పార్టీల్లో ఉన్న నేతలు కూడా సేఫ్ ప్లేస్ కోసం వేట సాగిస్తున్నారు. ఉన్న చోట గెలిచే అవకాశం ఉంటే సరి లేకపోతే పార్టీ ఫిరాయింపులకు రెడీ అవుతున్నారు.

ఈ తరుణంలో హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా వైసీపీ అధిష్టానం హిందూపురం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి మరో మహిళా నేతకు కట్టబెట్టింది.

ysrcp mlc mohammed iqbal

దీంతో ఆయన అక్కడి నుంచి అసంతృప్తిగా హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సత్యసాయి జిల్లా టీడీపీ నేతలతో ఇప్పటికే మాట్లాడిన ఆయన.. త్వరలో హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతోనూ హైదరాబాద్ లో భేటీ అవుతారనే చర్చ సాగుతోంది.

హిందుపురం ఎంపీ సీటు నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ఎమ్మెల్సీ ఇక్బాల్ రంగం సిద్దం చేసుకుంటున్నారనేది ఈ ప్రచారం సారాంశం. గతంలో నిజాముద్దీన్ వంటి మైనార్టీ అభ్యర్ధి హిందూపురం ఎంపీగా గెలిచిన చరిత్ర ఉండటంతో తాను కూడా టీడీపీ నుంచి అక్కడ పోటీ చేస్తే ఎంపీగా గెలవచ్చని ఇక్బాల్ భావిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

అయితే ఇందులో నిజానిజాలు తెలుసుకునేందుకు వన్ ఇండియా తెలుగు ప్రయత్నించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఇక్బాల్ సన్నిహితుల్ని సంప్రదిస్తే అలాంటి ఆలోచన ఏదీ లేదని, ఆయన వైసీపీలోనే కొనసాగనున్నట్లు వారు క్లారిటీ ఇచ్చారు.

హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించిన తర్వాత ఇక్బాల్ వైసీపీ నుంచే మరో సీటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కదిరి లేదా కర్నూలు సీటు నుంచి తనకు అవకాశం కల్పించాలని సీఎం జగన్ ను కోరుతున్నట్లు సమాచారం.

కదిరిలో ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ఉండగా.. కర్నూల్లో మైనార్టీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఉన్నారు. అయితే హఫీజ్ ఖాన్ ను మార్చే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సిద్ధారెడ్డి మరోసారి పోటీ చేయకపోవచ్చని తెలుస్తోంది. ఈ రెండు సీట్లలో ఒకదాంట్లో తనకు అవకాశం దక్కుతుందని ఇక్బాల్ ఆశాభావంగా ఉన్నారు.

Fact Check

వాదన

టీడీపీలో చేరి హిందూపురం ఎంపీ అభ్యర్ధిగా పోటీ కోసం వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ప్రయత్నాలు

వాస్తవం

టీడీపీలో చేరిక, ఎంపీగా పోటీ ప్రచారాన్ని ఖండించిన ఇక్బాల్ వర్గీయులు

రేటింగ్

Misleading
ప్రచారంలో ఉన్న వార్తలు వాస్తవమా అవాస్తవమా అని తెలుసుకునేందుకు [email protected] కు మెయిల్ చేయండి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+