వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్గంపారిపోవడం

By Staff
|
Google Oneindia TeluguNews

కేంద్రమంత్రి మహాశయుడు శిబూ సొరేన్‌విభ్రమ ప్రవర్తనతో అతిహేయమైన అవినీతి జబ్బుతో గిలగిల్లాడుతూమనుగడ సాగిస్తున్న భారతఅభారత అబాధ్యతాయుతప్రజాస్వామ్య కపట నాటకంలో మరోదుర్భర ప్రహసనానికి తెరలేచింది.శిబూసొరేన్‌ మంచివాడే అయి వుండవచ్చు.పెద్ద మనిషే అయి వుండవచ్చు. కాని,మచ్చ పడినప్పుడు వెంటనే ఆయన ఆమచ్చను తొలగించుకోవడానికినిజమార్గంలో ప్రయత్నించాలి. ధీరుడిగానిలవాలి. తన మంత్రిత్వానికి ఎవరూఅడగక ముందే రాజీనామా చేయాలి.తనను అరెస్టు చెయ్యమనిముందుకు రావాలి. న్యాయస్థానంముందు తలెత్తుకొని నిలవాలి. మరోవైపున పార్లమెంటరీ సంఘనియమానికి కోరాలి. తనకు తానుగాఎథిక్స్‌ కమిటీ ముందు హాజరు కావాలి.రుజువులు చూపాలి. అన్ని స్థాయిల్లోన్యాయాన్యాయాలు అతి త్వరగా తేలడానికిసహకరించాలి. తన నిజాయితీని తనచర్యలతో చాటాలి. అగ్నిశీల పరీక్ష నుండిబయటకు రావాలి. తిరిగి మంత్రిత్వ శాఖనుస్వీకరించాలి. అప్పుడు ఆయనవ్యతిరేకులు నోరు మూస్తారు.ప్రజలకు ఆయనపై గౌరవంపెరుగుతుంది. ప్రజాస్వామ్యంపైనమ్మకం కుదురుతుంది.కాని,శిబూ సొరేన్‌ ఎంచుకున్న మార్గంపారిపోవడం, దాక్కోవడం, అజ్ఞాతంలోకివెళ్లిపోవడం. ప్రజలు తమనువుద్ధరిస్తాడని ఎన్నుకున్న ఒకప్రతినిధి, పైగా ఒక మంత్రి యిటువంటిహీనచర్యకు పాల్పడడం మనప్రజాస్వామ్యం, ప్రాతినిధ్యం, రాజకీయం ఏస్థాయికి దిగజారిందో యిదితెలియజేయడం లేదా? అంతేకాదు,ఒక మంత్రి పారిపోవడం అతనివ్యక్తిగత విషయంగా ముగిసిపోదు.అది మన జాతికి చెందిన అన్నివ్యవస్థలతో సంబంధం కలిగివుండడం వల్ల అన్ని వైపుల నుండీ అదిప్రభావం చూపుతుంది.ముప్పైయేళ్ల క్రితం ఒక సామూహికహత్యాకాండకు ఆయన నాయకత్వంవహించారని, అందులో ఆయన ప్రధాననిందితుడని వార్తలొచ్చాయి. దానిపై ఓన్యాయస్థానం ముప్పై ఏళ్ల తర్వాతఆయనపై అరెస్టు వారెంట్‌ జారీచేసింది.ఇందులోన్యాయస్థానం పాత్ర ఏ విధంగావుందనుకోవాలి? ముప్పై ఏళ్లక్రితం జరిగిన ఓ దుస్సహ దుర్ఘటనపైముప్పై ఏళ్లు గడిచాక నింపాదిగా అరెస్టువారెంట్‌ జారీ చెయ్యడాన్ని ప్రజలు ఏ విధంగాఅర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకూన్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకంవుంది. కాని, యిటువంటి తాత్సారచర్యల వల్ల ప్రజల ప్రజల మనసులలోవెలిగే ఆ ఆశాదీపం కొడిగట్టదా? దీని వెనుకరాజకీయ, యితరత్రా శక్తులేవోవున్నాయని అనుమానించడానికిఅవకాశం లేదా?మొన్నటిసాధారణ ఎన్నికల్లో ప్రజల తీర్పుచారిత్రాత్మకమైనది. ఒక రకంగాచెప్పాలంటే పార్లమెంటరీ పంథాలోవిప్లవాత్మకమైనది. ఎవరిఅంచనాలకూ, వూహలకూ అందని రీతిలో ప్రజలుస్పందించడం జరిగింది. భాజాపాని దింపి,కాంగ్రెసు అధికారంలోకి రావడానికిఅవకాశం కల్పించింది. ఈ స్వర్ణావకాశాన్నియు.పి. ఎ. ప్రభుత్వం ఎంత వరకువినియోగించుకుంది? నూత్న అధ్యాయంరచించడనాకి పూనుకుంది?మొదటిరంగం ప్రధాన మంత్రి ఎన్నిక. సోనియాగాంధీ ప్రధాన మంత్రి అవుతారనేవాతావరణం కాంగ్రెసు పార్టీ గాఢంగాకల్పించింది. దాదాపు నిశ్చయమై పోయిందికూడా. అందుకు పూనుకున్నది కూడా.దానిపై విపక్షం తీవ్రంగా ప్రతిస్పందించింది.జన్మతః విదేశీ వ్యక్తి భారతప్రధానిగా గాని, వున్నత స్థానాలలో గానీవుండడానికి వీల్లేదని ప్రతిఘటించింది.తుఫాను సృష్టించింది. అదే జరిగితే, దేశంనలుమూలలా తిరిగి అగ్నిజ్వాలలు రగిలిస్తామనివురిమింది. దానిపై సోనియా గాంధీపరిణామాలను పరిగణనలోకి తీసుకొనితాను ప్రధాన మంత్రిని కాబోవడంలేదని, తనకా వుద్దేశమే లేదనివినమ్రంగా ప్రకటించింది. ఆమెనిర్ణయాన్ని అంతా హర్షించారు. విపక్షంసృష్టించే పెనుగండం నుండి,తద్వారా ఏర్పడే దుస్సంఘటనలనుండి దేశం బయటపడినట్లు అంతాభావించారు. దీనితో విపక్షంలోనివారునిరాయుధులయ్యారు. ఇదే విధంగాప్రశాంతంగా పరిణతి గల నిర్ణయాలతోకాలం సాగిపోతుందని అనుకోవడంజరిగింది.వాతావరణంలోప్రధాన మంత్రి ఎన్నిక జరిగింది.ఆతర్వాతి ఘట్టం పటిష్టమైన,నిర్మాణాత్మకమైన, నిజాయితీ గలసచ్చీలురూ, సమర్థులతో మంత్రిమండలిని ఏర్పాటు చెయ్యడం. ఇక్కడే కాలుబెణికింది. చెయ్యి వణికింది. ఆదిలోనేహంసపాదు ఇక్కడే పడింది.నేరచరితులు, ఆర్థిక నేరస్తులు, అసాంఘికశక్తులు - యిటువంటి మచ్చలుపడినవారు మంత్రివర్గంలోవున్నారని విపక్షం పేర్కొంటున్నవారూశిబూ సొరేన్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఎం. ఎ. ఎ.ఫాతిమా, మొహమ్మద్‌తస్లీముద్దీన్‌, జయప్రకాశ్‌యాదవ్‌, ప్రేమ్‌చంద్‌ గుప్తా. వీరుఅనేక శక్తియుక్తులతో ఎన్నుకోబడిపార్లమెంటు వరకూ వచ్చివుండవచ్చు. కానీ, వీరినిమంత్రివర్గంలోచేర్చుకోవాలనుకున్నప్పుడుఆలోచించివలసిన విషయాలు లేవా? వీరి గతచరిత్ర గురించి సోనియా గాంధీ గారికి,మన్మోహన్‌ సింగ్‌ గారికీ ఏమీతెలియదని అనుకోవాలా? వీరినిమంత్రివర్గంలో చేర్చుకుంటేవిపక్షం నుండి ఎటువంటిఅభ్యంతరాలు వస్తాయోఊహించలేకపోయారా? పొలిటికల్‌ఇంటెలిజెన్స్‌ లేదనే అనుకోవాలా? ఒకవేళ మచ్చలు పడినవారినిమంత్రివర్గంలోకి తీసుకోక తప్పనివత్తిడులే వస్తే ముందుగా వారిపైవున్న మచ్చలను తొలగించి, ఆతర్వాత వారిని చేర్చుకోవచ్చు గదా.కానీ, ఎవరి నుండీ ఎటువంటిఅభ్యంతరమూ రాదనుకోవడం,ఒక వేళ వచ్చినా దానిని తాముఎదుర్కొనగలమనుకోవడంయిదంతా చూసినప్పుడు తమనుతాము మితిమీరి హెచ్చుగా అంచనావేసుకోవడమో, లేక రాజకీయనిస్సహాయతతో రాజీ పడిపోవడమోఅయివుంటుందని అనుకోక తప్పదు.శిబుసొరేన్‌ వుదంతం విపక్షానికిదొరికిన పదునైన ఆయుధం. దానినిచేజేతులారా యిచ్చింది సాక్షాత్తుప్రభుత్వమే. ఒక ఆయుధాన్నివుపయోగించడమే కాదు,పుపసంహరించుకోవడం ఎలాగో కూడాతెలిసి వుండాలి. ప్రభుత్వానికి అదితెలిసినట్లు లేదు. సక్రమ మంత్రివర్గాన్ని నిర్మించలేని ప్రభుత్వంసమర్థంగా పరిపాలించగలదా?ఇదినీతికీ, విలువలకీ చెందిన అగ్ని. రాజుకుంటేదానిని ఏ శక్తీ ఆపలేదు; అర్పలేదు.ప్రజలుమేల్కొని ఎన్నకల్లో పాల్గొన్నారు. కొత్తచరిత్ర రాయమని అధికారంచేతికిచ్చారు. కాని, దాని వినియోగంగందరగోళంతో ప్రారంభమైంది. ఇదిమహా గంగరగోళానికి దారి తీస్తుంది. వీరికీపరిపాలనా సమర్థత లేదనినిరూపించే పరిస్థితి రావచ్చు.సంఘటనలన్నీ ఆ దారిలోనే వున్నాయి. దీనివల్ల ప్రజల సమస్యలు, వాటి పరిష్కారాలుచీకట్లో కలసిపోతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X