ఇది చేప.. అనుకుంటే పొరపడ్డట్టే- చైనా మరో ఘనత: సముద్ర గర్భంలో.. !!

టెక్నాలజీలో రోబోటిక్స్ పాత్ర రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే హ్యూమనాయిడ్లు ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాయి. దీన్ని మరో మలుపు తిప్పింది చైనా. తాజాగా ఓ నూతన రోబోను ఆవిష్కరించింది. బీజింగ్‌ లో ఏర్పాటైన చైనా ఇంటర్నేషనల్ ఫెయిర్ ఫర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ (CIFTIS) ఎగ్జిబిషన్ లో దీన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది. ఊహకు కూడా అందని ఇన్వెన్షన్ అది. అందరి దృష్టినీ ఆకర్షించింది. బీజింగ్ టెక్ ఫెయిర్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచింది.

అదే.. రోబోటిక్ ఫిష్. నిజం అనిపించేలా భ్రమింపజేసే చేప అది. నీటితో నింపిన ఓ ట్రేలో అచ్చం చేపలాగే ఎంతో సునాయాసంగా ఈత కొడుతున్న నూతన బయోనిక్ రోబోటిక్ ఫిష్ ను ఈ బీజింగ్ టెక్ ఫెయిర్ లో ప్రదర్శనకు ఉంచారు. జలచరాల సహజ కదలికలను తలపించేలా ఉన్న ఈ రోబోను చూసి సందర్శకులు ముక్కున వేలేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో అరుదైన, అత్యంత ఖరీదైన అరోవానా (Arowana) రకానికి చెందిన చేప ఆకృతిని ప్రేరణగా తీసుకుని రూపొందించారు.

Bionic fish robot is based on the arowana s look and swimming style powered fluid simulation China

దీని విలక్షణమైన రూపాన్నే కాకుండా, నీటిలో దాని కదలికలను కూడా ఈ రోబోలో అచ్చుగుద్దినట్లు అమర్చారు. ఫ్లూయిడ్ సిమ్యులేషన్ (Fluid Simulation) అనే అత్యాధునిక సాంకేతికత ఆధారంగా ఈ బయోనిక్ చేప పనిచేస్తుంది. దీనివల్ల నీటి ప్రవాహ తీవ్రతకు అనుగుణంగా ఇది ఈదగలుగుతుంది.

నేడు.. జిన్‌పింగ్ తో ప్రధాని మోదీ భేటీ: ఈ మూడింటిపైనే ఫోకస్?
నేడు.. జిన్‌పింగ్ తో ప్రధాని మోదీ భేటీ: ఈ మూడింటిపైనే ఫోకస్?

ఈ అరుదైన బయోనిక్ చేపను డెవలప్ చేయడానికి కారణాలు లేకపోలేదు. విభిన్న రకాల సముద్ర గర్భ పరిశోధనల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు దీన్ని. సాధారణంగా సముద్రంలోకి మానవ ప్రమేయం ఉన్న ఇతర భారీ యంత్రాలు గానీ సబ్మెర్సిబుల్స్ పంపినప్పుడు అక్కడి నివసించే జలచర జీవులు భయాందోళనలకు గురి అవుతాయి. వాటికి బదులుగా ఈ రోబోటిక్ చేపను సముద్రగర్భంలోకి పంపించాలనేది చైనా ఆలోచన.

అచ్చం చేపలాగే కనిపించడం వల్ల సముద్ర జీవులను ఇది ఎంతమాత్రం ఇబ్బందిగా అనిపించదు. వాటి సహజ సిద్ధమైన ఆవాసాల్లోని జీవన విధానాన్ని సురక్షితంగా, సునిశితంగా పరిశీలించడానికి ఈ రోబో ఫిష్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబోటిక్ చేపను నడిపించడానికి ఎటువంటి ప్రొపెల్లర్లు వాడలేదు. బదులుగా తోక, రెక్కల కదలికల ద్వారానే ఇది ముందుకు కదులుతుంది. ఇందులో అమర్చిన అత్యాధునిక లొకేటర్ సెన్సార్లు, కెమెరాల సహాయంతో ఇది ఆటోమేటిక్ గా ఈదగలుగుతుంది.

సముద్ర గర్భానికి వెళ్తోన్నప్పుడు పెద్ద రాళ్లు, ఇతర అడ్డంకులు ఏవైనా వస్తే వాటిని ముందుగానే గుర్తించి, తన దిశను మార్చుకునేలా దీనిని డిజైన్ చేశారు. ఈ వినూత్న సాంకేతికత ద్వారా రిజర్వాయర్లల్లో నీటి నాణ్యతను సైతం పరీక్షించడానికి అవసరమైన శాంపిళ్లను కూడా సేకరించవచ్చని చైనా చెబుతోంది.

ప్రస్తుత రోజుల్లో జల కాలుష్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద పర్యావరణ సమస్యగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో.. ఈ బయోనిక్ రోబోటిక్ ఫిష్ వంటి అధునాతన యంత్రాల సహాయంతో నదులు, చెరువులు, సముద్రాల్లోని కాలుష్య కారకాలను నిరంతరం పర్యవేక్షించడం సులువవుతుంది. పర్యావరణ రక్షణ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏ విధంగా అద్భుతాలు సృష్టించగలదో నిరూపించడానికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+