కెసిఆర్ కు చంద్రబాబు దెబ్బ

Chandrababu Naidu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజారాజ్యం, లోక సత్తా పార్టీలపై విరుచుకు పడుతున్నారు. కాంగ్రెసుకు ఆ పార్టీలు కొమ్ము కాస్తున్నాయని ఆయన విరుచుకుపడ్డారు. లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ పై విరాళాల ఆరోపణలు కూడా చేశారు. తమ పార్టీ ఓడిపోవడానికి ఆ రెండు పార్టీలే కారణమని ఆడిపోసుకుంటున్నారు. ఇన్నాళ్ల తర్వాత ఆయనకు జ్ఞానోదయం అయినట్లు మాట్లాడుతున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును దెబ్బ తీయడానికి తాను చేసిన ప్రయత్నాలను మాత్రం ఆయన కప్పి పుచ్చుకుంటున్నారు. పైగా, తెరాసతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే తెలంగాణలో ఇంకా ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవారని అంచనా వేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు ఆడలేక మద్దెల ఓడు అన్న్టట్లుంది.

చంద్రబాబు అతి విశ్వాసం వల్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ను దెబ్బ తీయాలని ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. తెరాస ద్వారా తెలంగాణలో లాభపడి దాన్ని దెబ్బ తీయాలని ఆయన అనుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన ఎన్నికలకు ముందు నుంచే తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టించారని చెప్పవచ్చు. సీట్ల సర్దుబాటు విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరిని కాకుండా కెసిఆర్ అనుసరించిన వైఖరే ఎక్కువ విమర్శలకు దారి తీయడం వెనక ఆ ఎత్తుగడ ఉందని అంటున్నారు. సీట్ల సర్దుబాటు పూర్తయిన చివరి నిమిషంలో తెరాసకు కేటాయించిన 16 అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు తన తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులకు బీ - ఫారాలు ఇచ్చారు. దీంతో తీవ్రమైన గందరగోళం నెలకొంది.

చంద్రబాబు సన్నిహిత మిత్రుడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కాంగ్రెస్ ను ఓడించడానికి త్యాగాలకు సిద్ధమన్నారు. కానీ చివరి నిమిషంలో కొద్ది పాటి సీట్ల కోసం మొండి పట్టు పట్టారు. సీట్ల సర్దుబాటును గందరగోళపరిచారు. పైగా చంద్రశేఖరరావుపై నిందలు మోపుతూ వచ్చారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ కూడా ప్రతిదానికీ చంద్రశేఖర రావును తప్పు పడుతూ వచ్చారు. పొత్తుల ధర్మాన్ని విస్మరించి ఆ ముగ్గురు నాయకులు తెరాస నాయకుడు చంద్రశేఖరరావును, తెలంగాణవాదాన్ని దెబ్బ తీయడానికి పూనుకున్నారనే విమర్శ ఉంది.

తెరాస అవసరం లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమనే ధీమా వల్లనే చంద్రబాబు తెరాసపై కత్తి కట్టినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సమీక్షకు పూనుకుని నిందను తెరాస మీదికే నెట్టారు. తెరాసతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవని చంద్రబాబు తెలుగుదేశం పార్టీ, ఆయనకు కొమ్ము కాస్తున్న దినపత్రిక వ్యాఖ్యానించే దాకా వెళ్లాయి. నిజానికి, తెరాసతో పొత్తు పెట్టుకోకపోతే తెలంగాణలో టిడిపి ఉనికి కూడా ప్రమాదంలో పడి ఉండేదే. ప్రజారాజ్యం పార్టీకి పడిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆ విషయం అర్థమవుతుంది. తెరాస ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి గానీ సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం ఓట్లు తెరాసకు పడలేదు. దీంతో తెరాస చాలా స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. వరంగల్ పార్లమెంటు సీటులో తెలుగుదేశం అధికారిక అభ్యర్థి పోటీలో ఉండడం వల్లనే తెరాస అభ్యర్థి ఓడిపోయాడు.

ఇదే సమయంలో చంద్రశేఖర రావు అతి విశ్వాసం కూడా కొంప ముంచింది. తెలుగుదేశం, తెరాస పొత్తు కాంగ్రెసు నడ్డి విరుస్తుందని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆ ప్రభుత్వంలో తాము చేరుతామని కెసిఆర్ కలలు కన్నారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ వాదానికి తక్కువ చంద్రబాబు హామీలను ఎక్కువ భుజాన మోశారు. ఫలితాలు వెలువడిన తర్వాత గానీ చంద్రబాబు, ఆయన మిత్రులు చేసిన నిర్వాకమేమిటో కెసిఆర్ కు ఎక్కలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+