రామోజీ-బాబు-చిరు

Ramoji Rao
మహాకూటమి ఏర్పాటుకు ప్లాన్ చేసింది రామోజీరావే. చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో కలిసి వెళ్లాలని భావించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ మనసు మార్చడంలో, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేయడంలో రామోజీ రావు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. నిజానికి, చంద్రబాబుకు కాంగ్రెసును ఓడించే సత్తా లేదని మొదట్లో గమనించి ఆయన చిరంజీవి పార్టీ పెట్టడాన్ని ప్రోత్సహించినట్లు సమాచారం. అయితే చంద్రబాబు తనకు హంగు, సమర్థత ఉన్నాయని నిరూపించుకోవడానికి తెగ ప్రయత్నాలు చేశారు.

నందమూరి హీరోలతో గుంటూరులో యువగర్జన సదస్సు జరిగిన తర్వాత రామోజీ మనసు మారినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందని భావించి చిరంజీవిని వదిలేసినట్లు చెప్తారు. దీంతో చిరంజీవి కాంగ్రెసుతో కుమ్మక్కయినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిని చేయడానికి వామపక్షాలతో, తెరాసతో పొత్తు కుదిరిలే రామోజీ రావు ప్రయత్నించారు. అయితే, సీట్ల సర్దుబాటు సజావుగా సాగలేదు. మహాకూటమి పార్టీల మధ్య తీవ్ర విభేదాలు, గిల్లి కజ్జాలు, కయ్యాలు చివరి వరకు ఎటూ తేలకుండా పోయింది.

తెరాసకు ఏ మాత్రం బలం లేని పలు స్థానాలను తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి కేటాయించడమే కాకుండా ఆ పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కయిందనే వార్తలను తనకు మచ్చికైన మీడియా ద్వారా చంద్రబాబు ప్రచారం చేయించారని అంటారు. దీనికి తోడు కెసిఆర్ ను లొంగదీయడానికి చివరి నిమిషంలో తెరాసకు కేటాయించిన 16 శాసనసభా స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఆయన బీ ఫారాలు ఇచ్చారు. ఇది ఇరు పార్టీల మధ్య అపనమ్మకాన్ని పెంచి పోషించింది. ఒక వైపు తాను అధికారాన్ని దక్కించుకోవడానికి తెరాసను వాడుకుంటూనే దాన్ని దెబ్బ తీయాలనే కుయుక్తితో చంద్రబాబు వ్యవహరించారని అంటారు.

రాష్ట్రంలో బిజెపిని వ్యతిరేకిస్తూ వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని చంద్రబాబుకు సూచించింది రామోజీరావేనని అంటారు. అదే సమయంలో ఎన్నికలు ముగియగానే చంద్రబాబు, కెసిఆర్ ఎన్డీయె వైపు వెళ్లేలా కూడా పథకాన్ని రచించింది రామోజీ రావేనని చెప్తారు. అందులో భాగంగానే ఫలితాలు వెలువడక ముందే కెసిఆర్ ఎన్డీయె వైపు వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఎన్డీయె అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే చంద్రబాబు కూడా ఎన్డీయెకు కాంగ్రెసును వ్యతిరేకించే సాకుతో అటు చేరి పోయి వుండేవారని అంటారు. అయితే, తెరాసను దెబ్బ తీయడం వల్ల అధికారానికి దూరమైంది చంద్రబాబే.

-రఘురాములు, వరంగల్
[email protected]

ఇటువంటి ఆర్టికల్స్ మీరు కూడా రాసి పంపవచ్చు. పంపాల్సిన మెయిల్ ఐడి [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+