వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధిక్కరిస్తున్న తెలంగాణ - దీక్ష తెలంగాణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
మల్లా నిప్పంటుకుంది, ఆర్ట్స్ కాలేజి భగ్గుమన్నది, పొలిసు బూట్లతో, క్యాంపు లతో యూనివర్సిటీలు దిగ్బంధం లో నలుగుతున్నాయి, నగరం లోనే 25000 మంది పోలీసులు, కంపెనీలే కంపెనీలు, నీకు తెలంగాణ అంటే ఎంత భయం ఉందొ నీ బలగమే చెపుతుంది, అది మా విద్యార్థుల వల్లనే..ఓన్లీ స్టూడెంట్స్ !త్యాగాల పరంపర నడుస్తూనే ఉన్నది..ప్రవీణ్ రెడ్డి గొంతు నుంచి కారిన వెచ్చని రక్తపుటేరులతో తడుస్తూనే ఉన్నది. రాజీనామాలు తెలంగాణని తెస్తాయ? తెచ్చినయా? చెప్పడం కష్టం ఏమో కాని కనీసం ఇప్పటికైనా నేతలు దిగి వచ్చిన్రు, దగా పడ్డ ఈ నెలకి కొద్దిగా భరోసా కల్పించే పరిస్తితి కల్పించిన్రు. ఐతే ఎప్పుడు ఈ పరిస్తితి వచ్చింది..మహానుభావుడు జయశంకర సార్ బతికున్నపుడే కాదు , తుది శ్వాస విడిచినంక కూడ అగ్గి రగిలిన్చిన్రు..ఇప్పటి తెలంగాణ నేతలకి దెబ్బ పడింది ఆయన పార్దీవ దేహం ఏకశిలా పార్క్ లో ఉన్నపుడే..అప్పుడు బడ్డ దెబ్బలకి , దిమ్మ తిరిగింది అన్నలకి..అప్పటి కోపం, ఆక్రోశం, ఆవేశం పెల్లుబికి ఉండక పొతే..బహుషా ఇప్పటికి కూడ నేతలు రాజీనామాలు చేసి ఉండే వారు కాదేమో..వందల ప్రాణాలు కదిలించ లేదు , ఎన్నో వేల మోసాలు కళ్ళు తెరిపించలే, కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాలు ఎపుడు మనసు మార్చలే, కనీసం ధైర్యంగా ప్రస్నిన్చాలే..చివరికి ప్రాణ భీతి, భయం, రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవడంతో దిగివచ్చి రాజీనామాలు చేసింరు..ఈ విషయాన్ని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు, మేము బయట తిరిగే పరిస్తితి లేదు అందుకే రాజీనామా చేయాల్సి వచ్చింది..అంటే తిరిగే పరిస్తితి ఉంటె చెయ్యరు అన్నమాటే..ఇన్ని రోజులు తన్నకుండా వదిలి పెట్టడమే మన తప్పు అని భావించక తప్పదు మరి. అన్నల్లార..ఈ ఒక్క చిన్న విషయం మాకు తెలిస్తే, ఎప్పుడో తన్ని తగలేసే వాళ్ళమే..అయిన మా పానాలు మేము తీసుకొనే దాకా ఆలోచిస్తాం కాని మీ పానాలకి ధోకా లేదు..భాద పడకండి, మేము శాప గ్రస్తులం..శవాలు మా ముందు కాలుతున్న, రక్తాలు చిన్డుతున్నా, లాఠీలు విరుగుతున్నా, వోల్లు చిట్లుతున్నా వంటా వార్పులు మాత్రం చేస్తాం, మీక్కూడా ఒక ముద్డ పెడతాం. ఈ తద్దినాలు కూడా మిమ్మల్ని మారుస్తాఎమో చూద్దాం! దిల్లి కి సెగ తగులుడు ఏమో కాని..పోయిన పానాలు మాత్రం క్షోభించడం ఖాయం. నా పిచ్చి తమ్ముళ్ళు, అన్నలు నాదే ఆఖరి చావు కావాలి అని చస్తున్నారు..ఎక్కడి ఆఖరురా భై, ప్రతిసారి మొదలే అయితుంది, ఆఖరి చావులు, ఆకలి చావులు, ఆత్మ గౌరవ చావులు మనకి అలవాటే కదా! చావకండిరా మమ్మల్ని మళ్లీ మళ్లీ చంప కండి..ఈ వెధవలు మారరు, ఇక్కడ మనసులు లేవు, మానవత్వం అసలు లేదు, మీ విలువైన ప్రాణాల్ని బలి ఇవ్వకండి, పోరాటం లో వీర మరణం పొందుదాం కాని, అవమానాలకి, అనుమానాలకి బలహీనపడి ఆత్మ త్యాగాలు చేసుకోకండి..

విచిత్రమైన పరిస్తితి, ఒక వైపు అన్ని పార్టీలు, అందరు రాజీనామాలు చేసింరు అని మురవాలో, లేక పొతే తలా ఒక్క జెండా పట్టుకొని జై తెలంగాణ అంటుంటే ఏడవాలో అర్థం యిత లేదు..అప్పుడు ఇప్పుడు బలి పశువులు విద్యార్థులే, అగ్గిరవ్వాలు ఈ యువకులే, యుద్ద భూమిలు విశ్వ విధ్యాలయాలే, వీరు యుద్ద శంకం పూరిస్తే..అక్కడ ఒక్క నాయకుడు ఉండదు..ఇంకా ఘోరంగా, వరంగల్లు లో , టిడిపి యాత్రలో విధ్యార్థులని పోలీసులకన్నా ఘోరంగా తన్నడం..ఇదేనా తెలంగాణ పోరాటం? విద్యార్థులు లేకపోతె ఉద్యమం ఎక్కడిది..కొంత మంది స్వార్థ పరుల చేతిలో పడి, వాళ్ళను నాశనం చేసిన తప్పు నాయకులది కాదా? ఇదే నాయకులు చంద్ర బాబు బొమ్మ ఎందుకు పెట్టుకున్నవని అడిగితె పొల్లు పొల్లు కొడతారా? ఇదెక్కడి న్యాయం..మీ మీటింగులలో వచ్చే కిరాయి జనం దేనికి నిదర్శనం? నిన్నటికి నిన్న కరీంనగర్ సభకి వచ్చిన అక్కలను ఎందుకొచ్చిన్రు అంటే కైకిలు(కూలి) వచ్చినం బిడ్డ అని చెప్పలేదా? మీ చంద్ర బాబు నాయడు చెపితే మీరు రాజీనామా చేస్తారా? సిగ్గులేదా ఆ మాట అనడానికి? ఇక్కడ జరుగుతున్న మారణ హోమం మిమ్మల్ని కదిలించలేదు కాని మీ నాయకుడి ఆజ్ఞలు పాటిస్తున్నారా? మీ నాయకుడు, కిరణ్ రెడ్డి, స్వార్థ పూరిత తెలంగాణ నాయకులతో తో మిలాఖత్ అయి అమాయక విధ్యార్థులని, ఉద్యమ కారులని, గొడ్లని బాదినట్టు బాదుత లేరా? నిన్న రాత్రి ముందస్తు అర్రేస్తులని ఎక్కడి కక్కడ అర్రేస్ట్లు చేసి, భయ బ్రన్తులని చేయట్లేదా? అరే అందరు కలిసి ఉద్యమం చేయన్దిరా భై అంటే చేయరు..రాజీనామా చేయరు..సరే నయానో భాయానో చేసింరు, (ఎందుకు చేసింరో మనకి అందరికి తెలుసు)ఇపుడు చేసినంకా ఎవడి దుకాణం వాడు నడుపుతా అంటరు. ఎర్రబెల్లి అండ్ కో ! నీ కిరాయి యాత్రలు ఎవరిని మోసం చేయడానికి? మా కాన్గ్రేసోల్లది ఇంకో లొల్లి..వాళ్ళు కూడా సత్యాగ్రహం చేస్తారంటా, ఇపుడు విద్యార్థులు చేస్తున్నారు కదా, మీరు వేరే ఇంకేదైనా పోరాట రూపం తీసుకోవచ్చు కదా..మా జాక్ వంటా వార్పూ చేస్తే, కనీసం మీరు రోడ్లు ఉడ్చే ప్రోగ్రాం చేయొచ్చు కదా..మెయిన్ రోడ్ కాక పొతే ఫుట్ పాత్ లు, అవి కాక పొతే బాత్రూమ్లు , నో ప్రాబ్లం, కాదేది ఉద్యమానికి అనర్హం, గాంధీ మార్గం లో సాధిస్తాం అని కాంగ్రెస్ నాయకులు చెపుతుంటే నవ్వాల్నో ఎడవాల్నో అర్థం కాదు, ఒక్కసారి అన్న వీరు స్వాతంత్ర పోరాట రూపాలని అర్థం చేసుకున్నారా, చదివార, తెలుసుకున్నార? బ్రిటిష్ వాళ్ళు ఎందుకు పారి పోయిన్రు కాదు వెళ్లి పాయింరు? ఇంత కాలంగా జరుగుతున్న ఉద్యమం లో ఒక్క సారి అన్న ఆంధ్రా వ్యాపారాలు దెబ్బ తీయడం గురించి ఆలోచించామ?కనీసం నాలుగు రోజులు రైళ్ళు , బస్సులు ఆపలెమా? ఓం శాంతి ! శాంతి! నో హింస ! నో వయోలెన్స్ !అవును ఇప్పటికి కరిమ్నగర్ల అవినాష్ వళ్ళు కాలిన వాసన ఇంకా గుప్పుమంటూనే ఉన్నది, చర్మం పొలుసులు పొలుసులు గా పడి న జాడలు ఇంకా కన పడతానే ఉన్నాయి, నడి బజార్ల నిలబడి నిండ కాలి హాస్పటల్ల ఉన్నాడు, బిడ్డను చూస్తె హింస నో ఆహిమ్సనో అర్థం ఐతది, అయ్యో ! ఎట్లా చెప్తే అర్థం ఐతది, నేను చచ్చే పరిస్తితి నువ్వు కల్పించినా, నువ్వు నన్ను చంపినా ఒకటే అని, ఒకటి ఆత్మ హత్య, ఇంకొకటి వీర మరణం..పేర్లు వేరే..దార్లు వేరే కాని చావు వొకటే, ఆశయం వొకటే.. చావు చావే కాదా? గాయం గాయం కాదా? రోజు రోజు చచ్చే కంటే ఒక్క రోజు చావు నయం కాద? విప్లవ పోరాటాల్లో ఆత్మ హత్యలు ఉండవు ఎందుకంటే అక్కడ మనిషిని ఎపుడు ఒక ఆశయం నడిపిస్తది, మనం ఉద్యమానికి విరామం కల్పిస్తూ, హాలిడేలు ఇస్తూ, అమాస పున్నానికి ఒక కార్య క్రమం ఇస్తే , అది కూడ రోడ్ల మీద పప్పు చారు వండుకోవడం..మనసు కదిలి , మళ్లీ ..చావు వార్తలు వింటూ ఎం చేస్తరో ఏమో, ఎవడికి తెలుసు..

మల్లా మూడు ముక్కల కథ, మొన్నటి ఎనిమిది చాప్టర్ల కథ ఇంకా మర్వనే లేదు , మూడు అంశాలు అని కొత్త పురాణం..కొంత మంది కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని మా పదవులని కాపాడండి అని వేడుకోలు ఫలిన్చినాయి కాబోలు..హైదరాబాద్ పై విస్తృత చర్చ అంట , ఎవడికి కావాల్ర చర్చా? నువ్వు, నీ సోనియమ్మ కూర్చొని, అవసరమైతే సీమాంద్ర నేథలకి ..మా దగ్గర చిన్న పిలగాడి నుండి, రేపు చచ్చే పండు ముసలి వరకు వచ్చి మీకు క్లాసులు చెపుతారు..ఇంకా కాల పరిమితి తో ప్రకటన..అన్నా! తొమ్మిది డిసెంబర్ ప్రకటన ఇంకా మరిచి పోలేదే! అపుడు అట్ల అనలేదు అని మల్లోక స్పష్ట మైన ప్రకటన అని, అది అస్పష్టం అని మమ్మల్ని ఆగం చేయకున్ద్రి కాల్మోక్తం కాని..అయినా ప్రకటించి, అతి స్పష్టంగా బిల్లు పెడితే మేము కూడ ఆలోచించే అవకాసం ఉంటుంది..మళ్ళా రెండో ఎస్సార్సీ అంట..ఇది మాత్రం తేనే పూసిన కట్టి మాటే.

నాయకులు ఇపుడు ఉన్న విద్యార్థులతో కలిసి నడవరు, ఎవడి లేక్ఖలు వాడివే, రేపు మాకు వోరిగేదేంది అని ఇప్పడి నుండే లేక్ఖలు..ఎవడితో ఎవడు కలవడు, కలిస్తే లేక్ఖలు తప్పుతై..అమ్మ సోనియమ్మ ఇంకా తెర వెనుక నుండి ఆడిపిస్తనే ఉంది.

ఈ పరిణామాలు జరుగుతున్నపుడు నేను డిల్లి లో ఉండడం(ఇక్కడి గ్రానైట్ మైనింగ్ ఉద్యమంలో భాగంగా) తో అక్కడ వీళ్ళ ఆటలు, అసలు వినే అదృష్టం కలిగింది, టీవిల ముందు వీరావేశంతో మాట్లాడే మన నాయకులు, వోకల్ల మీద వోకల్లు దుమ్ము పోసుకొనే వారంతా హాయిగా మందు కొడుతూ, రేపు రాష్ట్రాలు ఏర్పడితే ఎలాంటి పదవులు వస్తాయనే ఇప్పడి నుంచే కుర్చీల మీద కర్చీఫ్ లు ఎసుకుంటూ బిసిగా ఉన్నారు..ఇంకొంత మంది అసలు ఎందుకు రాజీనామాలు చేసామా అని తీవ్రంగా బాధ పడుతూ మరింత మందు తాగుతున్నారని వార్త..(వీళ్ళతో మెలిగే అతి సన్నిహిత వ్యక్తీ ద్వారా సమాచారం)..ఇంకొంత మంది విధులకి హాజరు అవుతాము అని చెప్పడం, అది తట్టుకోలేక మల్లా మా వీక్ గుండెలు ఆగి పోవడం..వాట్ ఏ కంట్రీ! యెహ్ హై ఇండియా అన్న! యెహ్ హై తెలంగాణ!

సందట్లో సడేమియా అని మా కృష్ణ మాదిగా అన్న, ఐలయ్య సారూ మల్లా అకస్మాత్తుగా తెర మీదకి ఒస్తరు. మనం తెలంగాణ అన్నపుడు అన్ద్రోల్లు సమైక్యాంద్ర అన్నట్టు..ఇపుడే మా అన్నలకి సామాజిక తెలంగాణ గుర్తొస్తది.. అన్న, మనోడికి డిపుటి సిఎం ఇస్తే ఏమ్చేస్తున్నడో చూసినావ్ కాదె! హక్కులు అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయి అన్న అంబేద్కర్ మాటలు మరిచినవా? తెలంగాణ వస్తే నీ ఇరవై సంవత్సరాల వర్గీకరణకి సమాధానం దొరుకుతుంది అన్న, మాదిగలు అధిక శాతం లో ఉన్న తెలంగాణ ల ఎవరి లొల్లి ఉండదు..సీమాంద్ర చేతిలో నువ్వు కూడా కీలు బొమ్మ కాకు జర ..మన పిల్లలు ఉద్యమాలల్లో కదం తొక్కుతున్నారు, అవసర మైతే అండగా ఉండు..నీ అవసరం ఇపుడు తెలంగాణ కి ఎంతైనా ఉంది..ఐలయ్య సారూ, తెలంగాణ ఉద్యమం అంటే అమెరికాల విసిటింగ్ ప్రొఫెస్సర్ ఉద్యోగం అంత వీజీ (ఈజీ) కాదు, ఒక్కసారి , కనీసం ఒక్క సారి అన్న ప్రత్యక్షంగా ఉద్యమం లో పాల్గొని చూడండి, చుట్టపు చూపుగా అన్న రండ్రి అపుడు తెలుస్తది ఉద్యమం అంటే ఏందో..అవును ఈ కులాల సమాజం లో , నిచ్చన మెట్ల సమాజం లో వివక్ష ఉంది నిజమే, రేపు కూడ ఉంటుంది నిజమే, పోరాటం తోనే సమ సమాజం సాధ్యం, మొదటి అడుగే ఈ తెలంగాణ ఉద్యమం ఆంధ్ర లో అయినా, తెలంగాణ లో అయినా.

ఎందుకొచ్చిన ఉద్యమమో కాని ఒక్కొక్కడి రంగు బయట పెడుతున్నది..జల్లెడ పట్టి మరి దగులబ్బాజి లను వేరేస్తున్నది. అవును ఎక్కడ గొంతు పెగిలితే అక్కడ అణచివేత ఎక్కువైతది, ఇది చరిత్ర చెప్పిన సత్యం, దొంగలంతా ఒక్క కాడికి వస్తారు, శత్రువులు మిత్రులైతారు, ఇన్ని కోట్ల జనాభాలో కేవలం కొద్ది మందే బలి ఐతారు , అదీ విదార్తులే, అక్కడక్కడ బలహీన మనస్కులు, ఉద్యమ కారులు,, వీరు లాబీలు చేయరు, రేపటి గురించి లేక్ఖలు వేయరు, పదవుల కాడ కుక్క కాపలా కాయారు, ఇవాళ పెట్టుబడి, రేపటి రాబడి అనే సూత్రం కోసం పని చేయరు..వీరు అసలు సిసలైన సైనికులు, మేము సైతం, మేము మాత్రం తెలంగాణకి అనుకుంటూ ముందుకు సాగే వీర సైనికులు..

తిరిగి తిరిగి ప్రజల చేతిలో పడ్డరు నాయకులు, దీక్షల తెలంగాణ మొదలైంది..మల్లా మెల్లగా జారుకుంటున్న నేతలు..డుమ్మా రాయుల్లని ఏమ్చేయాల్నో ఒక్కసారి వరంగల్లు పోరు బిడ్డలని అడిగితె చెప్తారు మరి. ప్రతి పేరు గుర్తుంది, ప్రతి ఒక్కడి మీదా ప్రజల కన్ను ఉంది..ఇంకెక్కడికి పోలేరు లే! ఉద్యమాలే శరణ్యం అని అందరు ఇపుడు నమ్మక తప్పదు..కేవలం రాజకీయ పరిష్కారమే అని లేక్త్చర్లు దంచిన మేధావులకి ఇపుడు జరుగుతున్న పరిణామాలు ఒక పెద్ద దెబ్బ. రాజకీయాలకి, నాయకులకి కూడా ఉద్యమ బాటనే గతి చివరికి..అదే మరి ఉద్యమం కి ఉన్న పవర్. ఉద్యమాల యుగం మనది, ఉద్యమిస్తే జయం మనది !

నీ అస్తమయం తో
ప్రపంచం అస్త మించడం లేదు
నేను నీ శిల్పం చెక్కాలి
ఇనుముతోనో, స్పటికం తోనో,
అగ్ని తోనో, మాటలతోనో,
నీ శిల్పం చేక్కాలి
నువ్వు ఒక గడియారంగా మారావు
సమయ సూచన చేసేందుకే (శివా రెడ్డి)

- సుజాత సూరేపల్లి

రచయిత్రి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో దట్స్ తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. దీనిపై పాఠకులు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చు.

English summary
Sujatha Surepally invites Telangana leaders resignations and praises students movement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X