చర్చ: చిరంజీవి కాంగ్రెసుకు సేఫ్ బోటా?

Chiranjeevi
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన గురువారెడ్డి, విశ్వనాథ్ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఎకీభవిస్తున్నాను. ఒక్కటైతే నిజం. ఎవరైనా మంత్రి పదవి వచ్చిన తర్వాత అతని అనుభవం అతని దూర దృష్టి లాంటి లక్షణాల వల్ల వచ్చిందని చెబితే ఎవరైనా నమ్ముతారు. కాని ఈ టర్మ్ లో కేంద్ర మంత్రి అయిన ఏ ఒక్క్కరు కూడా ఆ స్వాభిమానం చూపించట్లేదు. ఒక డాక్టర్‌కి మంత్రి పదవి అంటే సోనియా గాంధీని అందలంపైన పెట్టి మాట్లాడుతున్నారు. సర్వే సత్య నారాయణ ఎలా మంత్రి పదవి పొందారో అందరికీ తెలిసిన విషయమే. మైకు, కెమెరామాన్ కనిపిస్తే చాలు సోనియా గాంధీ గురించి తల్లి... అమ్మ..... దేవత..... భారత దేశాన్ని కాపాడటానికి వచ్చిన అపద్భంధవురాలు. ఆమె లేక పోతే మన దేసమే లేదు అన్నట్లు పొగుడు తుంటారు.

బాలరామ్ నాయక్ కి సెంట్రల్ మినిస్ట్రీ ఇవ్వడం ద్వారా వెనుక బడిన కులాల అభివృద్ధికి తోడ్పడుతున్నామనే భావన ప్రజల్లో కల్పించడానికే. అలాంటి మంచి ఆలోచనే వున్నప్పుడు ముందు నుంచే ఎందుకు ఇవ్వలేదు... ఇప్పుడు తెలంగాణా ప్రభావం, జగన్ ప్రభావం ఎక్కువ అయ్యాయని తెలిసి వచ్చిందా.. గులాం నబి ఆజాద్ అంటారు - జగన్ కాంగ్రెస్ లో వుంటే ముఖ్యమంత్రి అయ్యుండే వాడు అని.. అలాగే ఇంకో విషయం జగన్ పైన కేసు వేసిన శంకర్ రావు కి కొన్నాళ్ళు మంత్రి పదవి ఇచ్చారు కాని అతను ఆ పదవి లో చేసినది ఏమి లేదు.

కాని శంకర్ రావు చాలా తెలివైనవాడు ఇంకా సోనియా గాంధీ జపం చేస్తూనే వున్నాడు. పాపం ఆయనకు తెలియదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వుండేది అతి కొద్ది కాలమే(జగన్ బయటికి వచ్చినంత వరకే) అని. హనుమంత రావు మాత్రం చాల అన్యాయమే జరిగిందని చెప్పుకోవాలి. జగన్‌ని జగన్ ఫ్యామిలీని ఎంతగా తిట్టి పోసి సోనియా గాంధీని ఎంతగా పొగిడితే అతనికి ఏ పదవి ఇవ్వక పోవడం అన్యాయం కదా? (బహుశా అతను మౌన వ్రతం చాల సార్లు చేసాడని కొన్నాళ్ళు మౌనమే పాటించమన్నారేమో).

ఏది ఏమైనా 2014 లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. దానిని మార్చడం ఎవరి తరం కాదు. జగన్‌కు మద్దతు అనేది పార్టీ లకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా వస్తోంది. అటు కాంగ్రెస్ ఇటు తెలుగు దేశం పార్టీ ల నుంచి వలసల వెల్లువ మొదలయింది ఇంకా ఒకటిన్నర సంవత్సరాలు ఉండగానే మొదలైతే 2014 కి ఎలాగా వుంటుందనేది మరి చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు దేశం, కాంగ్రెస్ అనే పార్టీలు వరుసగా ఒకటి ఎండిపోతున్న కొలను, ఒకటి మునిగి పోతున్న టైటానిక్ లాంటివి.(ఇక్కడ కాంగ్రెస్ ని టైటానిక్ తో పోల్చాడ అతిశయోక్తే (పాఠకులు మన్నించాలి).

కాకపోతే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ని నిజంగా పెద్ద ఓడ లాగ చేసి సముద్రంలో వదిలితే కాంగ్రెస్ పెద్దలు దాన్ని వాళ్ళ చేతులతో వాళ్లే ముంచుకుంటున్నారు. చిరంజీవి సేఫ్ బోటు అని వాళ్ళ ఆలోచన. టైటానిక్‌యే మునిగిపోతుంటే ఒకే ఒక సేఫ్ బోటు ఏం చేస్తుంది. ఇంకో విషయం గమనించాల్సిన విషయం ఏమిటంటే చిరంజీవికి వున్నా శాసనసభ్యులు సాధారణ ఎన్నికల్లో గెల్చుకున్నవి. కాకపోతే మధ్యంతర ఎన్నికల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ చిరంజీవి కంటే ఎక్కువ శాసనసభ్యులను గెలుచుకుంది. సాధారణ ఎన్నికలకోసం జగన్‌ను ముఖ్యమంత్రిని చెయ్యాలని ప్రతి తెలుగు గుండె ఎదురు చూస్తోంది.....

- కుమారస్వామి రెడ్డి
పులివెందుల, వైయస్సార్ కాంగ్రెస్

(ఈ ఆర్టికల్‌లో వ్యక్తమైన అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై ఎవరైనా రాస్తే ప్రచురించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యాసంలోని అభిప్రాయాలపై రాసే వ్యాఖ్యలను [email protected] అనే మెయిల్‌కు పంపించండి. అభిప్రాయాలను ఒక్కటి రెండు వాక్యాల్లో కూడా వ్యాసరూపంలో వ్యక్తం చేయాలని మనవి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+