వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన ఇష్యూ: కిరణ్ ఏ విధంగా హీరో?

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
సమస్యల పరిష్కారం తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పడం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ఓ బూస్ట్ లాగా పని చేసిందట? కిరణ్ తర్వాత ఆయన దారిలో పలువురు నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయట? విభజన విషయంలో తాను, కిరణ్ ఒకటేనని బొత్స చెప్పగా, విభజనపై గత కొద్దిరోజులుగా పెదవి విప్పని కావూరి కూడా విభజనతో విచ్ఛిన్నమేనని పెదవి విప్పారట. అంకుర్ సినిమా పరిస్థితి వస్తుందేమోనని ఉండవల్లి ఆందోళన వ్యక్తం చేశారట.

కిరణ్ ప్రశ్నల పరంపరపై సీమాంధ్ర మంత్రులు, నేతల నుండి ప్రశంసలు వస్తున్నాయట. అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతూ, కొందరు మీడియా సమావేశాల్లో, జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనల్లో కిరణ్ వాదనను సమర్థింస్తున్నారట. కాంగ్రెస్ నాయకులు విభజన వల్ల కలిగే అనర్థాల గురించి బాగా వివరించారంటూ సిఎంను అభినందించారట!

వావ్! కాంగ్రెస్ మార్క్ రాజకీయ నాటకంలో బాగా నటిస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు! నంది అవార్డ్ ఎవరికివ్వాలో తెలియడం లేదు ప్రజలకి! సిగ్గూ యెగ్గూ అనేది ఉందా వీళ్లకి? కిరణ్, బొత్స, ఉండవల్లి, కావూరి, లగడపాటి, చిరంజీవి, మిగిలిన కాంగ్రెసోల్లలో ఏ కోశాన్నయినా చీము, నెత్తురు, ఆత్మాభిమానం అనేవి ఉన్నాయా? ప్రజల్ని, తెలుగు జాతిని వంచిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని వీల్లకి అర్ధమవుతున్నదా? వంటి మీద సోయుందా వీల్లకి? వీల్లని పుట్టించిన దేవుడ్ని అనాలి! విభజన జరుగుతున్నప్పుడు నిమ్మకి నీరెత్తినట్టుండి, సీమాంధ్రాలో ఉద్యమం ఉధృతం కాగానే ప్రజల కోసం పోరాటం చేస్తున్నట్టు నటిస్తూ చీకటి, ఆత్మ వంచన బ్రతుకులు బతకడం వీల్లకే చెల్లింది!

ప్రజల కోసం కాకుండా పదవుల కోసం ప్రజల్ని వంచిస్తూ బతికే కిరణ్, బొత్సా, చిరంజీవి, లగడపాటి, ఉండవల్లి, కావూరి లాంటి వాల్లని ప్రజలు అసలు క్షమిస్తారా? ఒక ఇటాలియన్ మాఫియా తన పనికిమాలిన కొడుకు భవిష్యత్తు కోసం తెలుగు జాతిని నిర్దయగా విడదీస్తుంటే డప్పులు కొట్టుకుంటూ నృత్యం చేస్తున్న వీల్లని ప్రజలు ఏమి చెయ్యాలి? పెద్ద హీరోల్లా పోజ్ కొడ్తున్న ఈ కిరణ్, బొత్సా, చిరంజీవి ఆడే నాటకాన్ని ప్రజలు గమనించలేరా? దమ్మున్న, నిజాయితే గల నాయకులైతే ఆ రోజే కిరణ్, బొత్సా, చిరంజీవి తదితర వాల్లు పదవులకి, పార్టీకి రాజీనామా చేసి ఉండాల్సింది, అంతే గాని ఈ రోజు సన్నాయి నొక్కులు కాదు చేయాల్సింది వీల్లు! ఇంత ఘోరమైన పదవీ కాంక్షా? రాజకీయాలు ఇంత నీఛమైపోయాయా?

హై కామండ్ అంటే ఢిల్లీలో ఉండే సోనియమ్మ కాదు, రాష్ట్రంలో ఉండే ప్రజలనే విషయం వీల్లకి యెరికెప్పుడవుతుంది? పది పన్నెండు ఎంపీ సీట్ల కోసం తెలుగు జాతిని చీల్చడం ఎంతటన్యాయం? రాష్ట్రం విడిపోవడం అనేది ఒక శాస్త్రీయ విధానంలో, ఇరు ప్రాంతాల హక్కులు, ప్రయోజనాలు భంగం కాకుండా జరగాల్సిన విషయం! కాని ఈ రోజు రాష్ట్రాన్ని విభజించడం సోనియా తన కొడుకు కోసం ఒక జాతిని ముక్కలు చెయ్యడాన్ని సమర్ధిస్తూ కిరణ్ లాంటి నాయకుడు మన రాష్ట్రానికి సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అవ్వడం మన జాతి చేసుకున్న శాపం!

పదవి తప్ప ప్రజలపైన ఆసక్తి లేని వీల్లని ఎవరు క్షమించగలరు? ఇక చంద్రబాబు, అతని నాయకత్వ పటిమ మీద, అతని వ్యక్తిత్వం మీద, తెలుగు జాతి చీలిపోవడంలో అతని పాత్ర మీద, అతని స్వార్ధ రాజకీయాల మీద మాట్లాడటం శుద్ధ వ్యర్ధం!

- గురువా రెడ్డి, అట్లాంటా

(రచయిత గురువారెడ్డికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో అనుబంధం ఉంది. ఆయన ఈ వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వన్ ఇండియా తెలుగుకు ఏ విధమైన సంబంధం లేదు. ఎవరైనా తమ అభిప్రాయాలను వెల్లడించదలుచుకుంటే రాయండి.. వాటికీ స్థానం కల్పిస్తాం..)

English summary
NRI from Atlanta Guruva Reddy has questiond the leadership capacity of CM Kiran kumar Reddy in Andhra Pradesh bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X