షిరిడీ పుర వీధుల్లో గురు పౌర్ణమి శోభ- కాకడ హారతి వెలుగులు

నేడు.. గురు పౌర్ణమి. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆనవాయితీ. వేద వ్యాసుడు గురు పౌర్ణమి నాడే జన్మించారని నమ్ముతారు. అందుకే ఈ రోజును వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. సమస్త మానవాళికి వేదాలను బోధించడం అనేది ఆయనతోనే ఆరంభమైనందు వల్ల ఆది గురువుగా పూజిస్తారు వ్యాస మహర్షిని. గురువు ఆశీస్సులు మెండుగా ఉండాలనే సద్భావనతో ఇవ్వాళ గురుబ్రహ్మలను పూజిస్తారు.

చతుర్వేదాలకు రూపకల్పన చేసి, అష్టాదశ పురాణాలు, మహాభారతాన్ని రచించిన జగద్గురువు వేదవ్యాస మహర్షి జన్మించిన పవిత్ర దినమిది. ఈ రోజున ఆదిగురువైన వ్యాస మహర్షిని స్మరిస్తూ పూజించడం వల్ల జీవితంలో జ్ఞానసిద్ధి కలుగుతుందని భక్తుల ఘాఢ విశ్వాసం. వేదాల్లో గురువుకు ప్రత్యేక స్థానం ఉంది. హిందు సంప్రదాయాల ప్రకారం.. గురువును భగవంతుని కంటే కూడా ఉన్నతుడిగా పూజలందుకుంటాడు. వేద వ్యాసుడు బోధిస్తోండగా.. సాక్షాత్ వినాయకుడు మహా భారతాన్ని రాశాడని ప్రతీతి.

Devotees Celebrate Guru Purnima with a Holy Dip and Visit Shirdi Sai Baba Temple to seek blessings

ఈ పర్వదినం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్నాన ఘట్టాలు జనమయం అయ్యాయి. అయోధ్యలోని సరయూ నదీ తీరం గురు పౌర్ణమి పర్వదిన వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే సరయూ నదీ తీరానికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు, సాధువులతో నదీ తీరమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.

ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు పడే ఛాన్స్- వాతావరణంలో మార్పులు
ఏపీలోని ఈ జిల్లాల్లో నేడు వర్షాలు పడే ఛాన్స్- వాతావరణంలో మార్పులు

అటు హరిద్వార్, వారణాశిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గంగానదిలో భక్తులు నదీస్నానాలను ఆచరిస్తోన్నారు. సూర్యభగవానుడికి ఆర్ఘ్యాన్ని సమర్పిస్తోన్నారు. వారణాసిలో ఈ రోజున గురు మంత్రోపదేశం తీసుకునే సాంప్రదాయం శతాబ్దాలుగా వస్తోంది. ఈ రోజున చేసే దానధర్మాలు, జపతపాలు విశేషమైన పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి, జ్ఞాన మార్గం వైపు నడిపించే గురువుకు కృతజ్ఞతలు తెలుపుకునే ఏకైక పర్వదినం ఇదే.

మా వద్ద ప్లాట్లు కొంటే.. జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం: టీటీడీ రియాక్షన్.. స్ట్రాంగ్
మా వద్ద ప్లాట్లు కొంటే.. జీవితాంతం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం: టీటీడీ రియాక్షన్.. స్ట్రాంగ్

షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తజన కోలాహలం మధ్య వార్షిక గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ పవిత్ర ఉత్సవాల కోసం సాయిబాబా సమాధి ఆలయాన్ని, పరిసర ప్రాంతాలను రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులతో షిరిడీ పురవీధులన్నీ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతున్నాయి.

భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ లో భారీ మార్పులు
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమ్ లో భారీ మార్పులు

ఈ తెల్లవారుజామున 5:15 నిమిషాలకు జరిగిన కాకడ హారతి అనంతరం బాబా ప్రతిమ, పవిత్ర గ్రంథం, వీణతో ఆలయ పరిసరాల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో సంస్థాన్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి గోరక్ష గాడిల్కర్, డిప్యూటీ సీఈఓ భీమరాజ్ దరాడే సహా పలువురు ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. శోభాయాత్ర ద్వారకామాయి ఆలయానికి చేరుకున్న తర్వాత శ్రీ సాయి సచ్చరిత పవిత్ర గ్రంథ అఖండ పారాయణం ప్రారంభమైంది. పుణే నుంచి కాలినడకన వచ్చిన పల్లకీ కమిటీ భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్నారు.

ఈ రోజున ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున మంగళ స్నానం, పాదపూజల అనంతరం లెండీబాగ్‌లో రమణీయంగా ధ్వజపూజ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా తరలివస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రాత్రి అంతా సమాధి ఆలయ ద్వారాలను తెరిచే ఉంచాలని సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయించింది. ఈ ప్రత్యేక విరామం కారణంగా ఈ రాత్రికి నిర్వహించాల్సిన శేజారతి, గురువారం తెల్లవారుజామునాటి కాకడ హారతి సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+