దుర్గం రవిందర్: తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలంటే

సీడబ్ల్యుసీ తీర్మానంలో చెప్పినట్లు హైదరాబాద్ రాజధానిగా పదని జిల్లాలతో కూడి తెలంగాణ ఇవ్వాలి.
పోలవరం పేరుతోనో, లేదంటే 1956 ముందు ఆంధ్ర ప్రాంతంలో ఉందన్న కారణంతోనో భద్రాచలం రెవిన్యూ డివిజన్‌ను ఖమ్మం జిల్లా నుంచి వేరుచేయొద్దు.
ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ రెవిన్యూ డివిజన్‌ను మాత్రమే పరిమితం చేసి పదేళ్లకాలాన్ని 5 ఏళ్లకు తగ్గించాలి.
రాష్ట్ర విభజన జరిగిన తక్షణం రెండురాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టు, బార్‌కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలి.
371-డి ఆర్టికల్‌ను సవరించి రెండు రాష్ట్రాలకు వర్తింప జేయాలని కోరారు.
తెలంగాణ ప్రాంతంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడానికి ఇంకా 66 వేల కోట్లు కావాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వమే జీఓఎంకు నివేదిక పంపినందున వాటి పూర్తికి కేంద్రం సాయం చేయాలి.
సింగరేణి కాలరీస్‌లో సీమాంధ్రకు వాటాలు ఇవ్వొద్దు
రాయల తెలంగాణ ప్రతిపాదన వస్తే తిరస్కరించాలి.
శాంతిభద్రతలు, భూమి, రెవిన్యూ, మున్సిపల్ వ్యవహారాలు, ఉన్నత విద్య రంగాలను ఈ పదేళ్ళు రెండు రాష్ట్రాలకు అందుబాటులో ఉండేందుకు మీలు కాదు.
నదీ జలాల పంపిణీ విషయంలో ట్రైబ్యునళ్ల తీర్పులకు కట్టుబడి ఉంటామని, నియంత్రణమండలి ఏదైనా ఏర్పాటుచేస్తే దాన్ని కృష్ణానదిపరీవాహక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసేలా మంత్రుల బృందాన్ని ఒప్పించాలి.
తెలంగాణాలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజి కోరాలి.
హైద్రాబాద్ ఆదాయాన్ని కేవలం తెలంగాణకే పరిమితం చేయాలి. అందులో కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి పంపిణీ వుండకూడదని హైద్రాబాదులో, ఢిల్లీలో సమావేశమైన కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు, మూడు దఫాలు సమావేశమయ్యారు. మొన్న నిన్నటి వరకు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న స్తబ్దులు కూడ హాడావిడిగా తెలంగాణ వేదికలు ఎక్కిన హల్‌చల్ చేస్తున్నారు.ఇలాంటి వారుకూడ ఈ సమావేశానికి హాజరయ్యారు.
వస్తున్న వార్తలు, జరుగుతున్న పరిణామాలు, చూస్తుంటే తెలంగాన రాష్ట్ర విభజన ప్రక్రియ మరింత వేగవంతం అయ్యేట్లున్నది. దీనికి అనుగుణంగానే స్తబ్దనాయకులు, సమైక్యవాదులు గళాలను సమరించి జై తెలంగాణ అనడానికి సిద్ధపడుతున్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications