మల్కాజిగి లోకసభ సీటు: జెపితో నాగేశ్వర్ ఢీ

తనకు లోక్‌సభకుపోటీచేసే యోచన ఉందని, ఒక వేళ చేయాల్సి వస్తే మల్కాజిగిరి నియోజకవర్గంనుంచే బరిలోకి దిగుతానని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.జయప్రకాశ్‌నారాయణ్ (జేపీ) స్పష్ట్టం చేశారు. తాను ఢిల్లీలో ఉంటే దేశ స్థాయిలో మరిన్ని మార్పులు, సంస్కరణలకు దోహదపడవచ్చని తన అభిమానులు, మరికొందరు సూచిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఒక్క పార్లమెంటు స్థానం కూడా తమ పార్టీకి లేకుండానే దేశంలో 9 చట్టాల ఏర్పాటుకు లోక్‌సత్తా కారణమైందని ఆయన చెప్పారు.
మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ నాగేశ్వర్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన బరిలో దిగితే నాగేశ్వర్‌కు మద్దతివ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఆనందకుమార్ నాగేశ్వర్‌కు ఫోన్ చేసి మల్కాజిగిరి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాలంటూ ప్రతిపాదించినట్లు తెలిసింది. దానికి ఆయన నిరాకరిస్తూ ఒకవేళ పోటీ చేయాల్సి వస్తే స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని చెప్పినట్లు సమాచారం. స్వతంత్రంగా బరిలోకి దిగినా నాగేశ్వర్‌కు మద్దతివ్వాలని ఏఏపీ నిర్ణయించినట్లు తెలిసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు లభిస్తే నాగేశ్వర్‌కు నైతికంగా మంచి బలం చేకూరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జెపి, నాగేశ్వర్ మల్కాజిగిరి బరిలోకి దిగిన పక్షంలో మేధావుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందోనన్న విషయం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది. నాగేశ్వర్ రావుకు వామపక్షాల మద్దతు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజకీయ విశ్లేషకుడిగా నాగేశ్వర్ మంచి గుర్తింపు పొందారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications