‘సామ్రాజ్యం’ చరమ దశ: జేమ్స్ బాండ్‌కు వీడ్కోలు!

నేడు పరిస్థితులు మారిపోయాయి. నేడిప్పుడు-నాటి ప్రచ్ఛన్న యుద్ధ కాలం తాలూకు- ఒకానొక పాత్రధారి సోవియట్ యూనియన్ (కమ్యూనిస్టు రాజ్యంగా) లేదు. మరో పక్కన, 2001-08 అనంతర ‘యుగంలో' ప్రపంచంలోని అమెరికా కేంద్రిత పెట్టుబడిదారి ప్రపంచం తాలూకు పతనం వేగం అందుకుంటోంది. ఈ పతన క్రమానికి-‘సెక్యూలర్ స్టాగ్నేషన్' వంటి పేర్లు పెట్టుకుని - పాశ్చాత్య ఆర్థిక, రాజకీయ నిపుణులు కాలం వెల్లబుచ్చుతున్నారు. అంటే; ఇక ముందు కాలం యావత్తూ- వ్యవస్థను, ఈ సంక్షోభం తాలూకు లక్షణాలు వదిలిపెట్టకుండా, వెంటపడుతూనే ఉంటాయి. కాబట్టి, ఇక ఇది పరిష్కారం లేని ఆర్థిక సంక్షోభం. శాశ్వత సమస్య. కాబట్టి; నేటి పెట్టుబడిదారీ విధానం - ఒక రకంగా రోగగ్రస్థమై మరణశయ్యపై తీసుకుంటోంది.
మరి; ఈ క్రమంలో- దాని తాలూకు నిన్నటి హీరోకు కూడా అనివార్యంగా అంత్యక్రియలు జరిగిపోవాలి. నిజానికి జరిగింది అదే. ‘బ్రిటీష్ మెడికల్ జర్నల్'లో ప్రచురితం అయిన ఒక పరిశీలనావ్యాసం ఈ అంశాన్ని వెల్లడిస్తోంది. బ్రిటన్‌కు చెందిన ముగ్గురు వైద్యులు జేమ్స్ బాండ్ పాత్ర తాలూకు 14 మూల రచనలను (వీటి రచయిత, జేమ్స్ బాండ్ పాత్ర సృష్టికర్త ఐయన్ ఫ్లెమింగ్) క్షుణ్ణంగా అధ్యయనం చేశాక పలు నిర్ధారణలకు వచ్చారు. ఈ క్రమంలో భాగంగా, ఆ వైద్యులు ఈ రచనలలో జేమ్స్ బాండ్ పాత్రధారి అలావాట్లను (అతను ఎప్పుడు, ఏమి తాగాడు? వంటివి) పరిశీలించారు. ఈ అధ్యయనం ప్రకారంగా, జేమ్స్‌బాండ్ పాత్రధారి తాలూకు అలవాటు అయిన భారీ మద్య సేవనం, అతనిని మద్యం సంబంధిత పలు రకాల వ్యాధులకు గురి చేసి, తద్వారా 50వ పడి మధ్యలోనే అతడి మృత్యువుకు కారణం కాగలదు. అలాగే, అతని పొగాకు వినియోగం కూడా దీనిని వేగిరపర్చగలదు. అంటే, నిన్నటి 007, మద్యానికి బానిసైన వారందరి లాగానే- వణుకుతున్న చేతులతో, సకల రుగ్మతలతో సతమతమవుతాడు. అదీ కథ. కాలంతోడై కదిలిన -పాత్ర తాలూకు - ముగింపు అధ్యయానికి సంబంధించిన కథ.
నిజానికి నేడు, పాశ్చాత్య దేశాలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. పలు రకాల ఆర్థిక సమస్యలతో తమ ఆధిపత్యం చేజారిపోవడం, అవి నేడు చవిచూస్తున్నాయి. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ - ప్రపంచాన్ని శాసించిన - డాలర్ ఆధారిత అమెరికా అగ్రరాజ్య పరిస్థితి నేడు ఆగమ్య గోచరంగా తయారైంది. గత చరిత్రలోని ఘనత వహించిన పలు ఇతర గొప్ప సామ్రాజ్యలలాగానే - నేడు అమెరికా పతనం అంచుకు చేరింది. కాగా, కాలం పసిడి రెక్కలు విసిరిన ఈ అమెరికా గతం తాలూకు ప్రతినిధి, ఫాంటసీ పాత్ర, జేమ్స్ బాండ్ నేడు అవసరం లేకుండా పోయింది. పలు గిరిజన తెగల్లో- చనిపోయిన తమ వారి శరీరాలతోపాటు వారికి సంబంధించిన వస్తు సామాగ్రిని కూడా సమాధి చేసే ఆచారం వుంది. నేడు శిథిలమై, మరణం దిశగా సాగుతున్న అమెరికా సామ్రాజ్య వ్యవస్థ విషయంలో కూడా ఇది నిజం. దీని గత చరిత్రతోపాటుగా, ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లనూ, విలువ సూచికలను కూడా నేడు దానితోపాటుగా సమాధి చేయవలసి వస్తోంది. దీనిలో భాగమే-జేమ్స్ బాండ్ పాత్ర, రచనలపై- ఈ ముగ్గురు బ్రిటన్ వైద్యుల పరిశీలన. బహుశా, గత కాలంలో, అంటే జేమ్స్ బాండ్ పాత్రదారి ఇమేజ్ లోని ఉచ్ఛదశలో ఉండగా- ఇటువంటి పరిశోధనలోని ఫలితాల ప్రకటనా-అటు జేమ్స్ బాండ్ అభిమానులకు గానీ, అది సృజించిన ఫాంటసీ పాత్ర ఆధారిత తమ ఊహలో ప్రపంచాన్ని నిర్మించుకున్నారే గానీ, ఎట్టి పరిస్థితులలోనూ మింగుడు పడేది కాదు. వ్యవస్థను హీరో పాత్రను... అభిమానులు అతి త్వరగా, తన ప్రాభావాన్ని కోల్పోవడానికి, నిస్సదేహంగా మరణశయ్యపై వుండడానికి- అప్పట్లో అంగీకరించి వుండేవారు కాదు. అదీ! జేమ్స్ బాండ్ విషాదాంతం.
ఈ క్రమానికి మచ్చుతునకలు అనేకం. నిన్నటి వరకూ- అమెరికా మాటలకూ, చేతలకూ ఎదురే లేదు. చైనా వంటి దేశాల విషయంలో- అమెరికా- పదే పదే మానవహక్కుల ‘ఉల్లంఘన'ల గురించి ప్రస్తావించేది. టిబెట్ వంటి అంశాలలో చైనాపై అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చేది. ఇక, ఇటువంటి ఇతర అమెరికా అనుకూల పాశ్చాత్య నేతల తీరు కూడా ఇదే. కాగా, వీరంతా కలగలిసి, తమ మాట వినని- దుష్ట రాజ్యాలపై, ఆర్థిక ఆంక్షలు విధించి, వాటిని ‘దారికి' తెచ్చేవారు. ఇది, నిన్నటి కథ. కానీ నేటి కథ వేరేది. ఇది నేడు ఈ పాశ్చాత్య రాజ్యాలు చైనా, ఆగ్రహానికి గురికాకుండా వుండేందుకు పాట్లు పడుతున్న కథ. అలాగే ఇరాన్ వంటి దేశాల విషయంలో-తమ ఇచ్ఛానుసారం యుద్ధాలు చేయలేక రాజీమార్గాల కోసం, నేడు రకరకాల దారులలో పాశ్చాత్య పాలకులు వెతుకాడుతున్నారు. నిన్నటి తమ రణభూమి ఆఫ్గన్ నుంచి- చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు-ఎలాగోలా బయటపడాలని-వీరు నేడు టైమ్ టేబుల్స్ వేసుకుంటున్నారు. ఇప్పటికే తాము మరుభూమిగా మార్చిన - ఇరాక్ నుంచి వైదొలగి వున్నారు.. ఇలా చెబుతూ పోతే నేడు ముగిసిపోతోన్న- మరో మహా సామ్రాజ్యం తాలూకు-ఆఖరిని నిశ్వాసాలు లెక్కలేనన్ని వుంటాయి.
దీనంతటికి ఉదాహరణలు చెప్పుకొన్నన్ని చాలాకులాయి. 2012లో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్- టిబెట్ ‘ఆధ్యాత్మిక గురువు' దలైలైమాను కలిశాడు. చర్చలు జరిపాడు. దీనితో, చైనా ఆగ్రహించింది. కామెరూన్, ఆయన దేశం బ్రిటన్‌పై అది (చైనా) శీతకన్నువేసింది. ఇంకేముంది; అనతి కాలంలో బ్రిటన్ వ్యాపార వర్గాలు- తమ నోటి కాడి కూడు పోతోందంటూ గగ్గోలు బెట్టసాగారు. తమ వ్యాపారం మాత్రం-ఇతర యూరప్ దేశాలకు మళ్లిపోయిందని వారు కామెరూన్ ముందు మొరపెట్టుకున్నారు. అంతే, పరిస్థితి తిరగబడింది. తాను టిబెట్‌కు స్వాతంత్ర్యం కోరడం లేదనీ, మరోమారు దలైలామాను కలిసే ఆలోచన కూడా ఏమి లేదంటూ- కామెరూన్ లెంపలేసుకున్నారట! ఆ తరువాతే, బ్రిటన్ సారథ్య బృందంతో కలిసి ఆయన చైనా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ దెబ్బకు-మీరే ఇతర యూరోపియన్ యూనియన్ నేత కూడా- ఇక ముందు దలైలామాను కలిసేందుకు సాహసించలేకపోచ్చునంటూ- ఒక ప్రఖ్యాత పాశ్చాత్య పత్రిక వెల్లడించింది. ఇది పాశ్చాత్య దేశాల బృందంలోని యూరోప్ దేశాల కథ. కాగా, వారందరి నేత అయిన అమెరికా కూడా దరిదాపు ఇదే వ్యథ. 2009లో చైనా పర్యటన సందర్భంగా, టిబెట్ చైనాలో అంతర్భాగామేనంటూ ప్రకటించేయడం ద్వారా- అమెరికా అధ్యక్షుడు ఒబామా-తమ చిరకాల మిత్రుడు దలైలామాను ఒంటరి వారిని చేసేశారు. ఇక నీకు, అమెరికాలోని పలు నగరాలు, వాటి మేయర్లూ- చైనా పెట్టుబడులను ఆకర్షించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. ఈ విషయంలో వారు ఒకరితో ఒకరూ, అలాగే ఇతర దేశాల నగరాల మేయర్లతో కూడా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా, వారు చైనా పర్యటనలు చేస్తూ- తమ తమ నగరాలు- చైనా పెట్టుబడులకు ఎంతగా ఆకర్షణీయమో-ప్రజెంటేషన్‌లు ఇచ్చుకుంటున్నాయి.
ఈ స్థితిలో-మరలా జేమ్స్ బాండ్ తిరిగి ఒక పాత్రగా ప్రేక్షకుల ముందు కొనసాగినా, అది ఆ పాత్ర తాలూకు సరికొత్త జన్మగానే ఉండగలదు. ఆ పాత్ర తాలూకు పాత మెషియో, అమెరికా విలువల ఆధారిత స్థితీ ఇక కొనసాగలేదు. అదీ సంగతి. ఓడలు బండ్లు గానూ.. బండ్లు ఓడలు గానూ అంటే ఇదేనేమో!!
-డి పాపారావు
-
అగ్నికి ఆజ్యం పోసిన ట్రంప్- క్రూడ్ రేట్లు జంప్ -
సైలెంట్ కిల్లర్స్: ఇరాన్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ఇజ్రాయెల్ 'యూనిట్ 8200'!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications