క్విక్ బాక్సింగ్: మనసూ-మంకీ
అదో ఆశ్రమం. ఆశ్రమంలో ఎవరుంటారు? స్వామిజీ యే కదా. అవును. అంతే. అదో స్వామీజీవున్న ఆశ్రమం. స్వామీజీ జ్ఞానానికి నిలువెత్తు రూపం కదా కనుక ఆశ్రమానికి వచ్చే వాళ్లూ పోయేవాళ్లూ జనం.
వచ్చిన వాళ్లకి నాలుగో అయిదో మంచి మాటలు చెప్పి పంపుతుండే వారు స్వామీజీ. న్యాయమనీ ధర్మమనీ సత్యమనీ దానమనీ పరలోకమనీ పాప పుణ్యాలనీ మనిషికి సుఖమూశాంతీ అనే వాటికి మూలం మనసనీ చెబుతుండేవారు.
ఏ విషయమైనా, సందర్భమేదైనా ఆయన మాటల్లో మనస్సనే పదం మళ్లీ మళ్లీ వినవచ్చేది. అసలు మనిషంటేనే మనస్సని మనస్సు మనిషికి రిమోట్ కంట్రోల్ వంటిదనీ సెలవిచ్చేవారు. మనస్సును మనిషి కనుక అదుపులో వుంచుకుంటే అంతాశుభమే అనేవారు. మరో రకంగా మనసు కనుక మనిషి కంట్రోల్‌లో వుంటే అంతా సుఖమేననీ అనేవారు. అసలు ఈ ప్రపంచంలో దు:ఖాలన్నింటికీ ప్రాబ్లమ్స్ అన్నింటికీ కారణం మనస్సు మనిషి చెప్పు చేతల్లో లేకపోవడమేనని ఘంటాపథంగా చెప్పేవారు. అసలు స్వామీజీ మాట్లాడిన యే సందర్భంలోనూ మనస్సునీ కోతినీ పోల్చకుండా వదిలింది లేదు. మనిషి మనసు కోతిలాంటిదని మనిషి బుద్ధి కోతి బుద్ధి అని చెప్పని రోజంటూ లేదు.
స్వామీజీ రోజూ వచ్చీపోయే జనాలకు కంపల్సరీగా అన్నెససరీగా కోతి ప్రసక్తి తేవడం ఎందుకని పిచ్చి కోపం వచ్చిందో కోతికి. అవును. కోతికే!
ఆ పరిసరాల్లో వున్న చెట్ల మీద అనేక కోతులు కోతి చేష్టలు చేస్తూ చెట్ల మీద కోతి కొమ్మచ్చిలాడుతూ వుండేవి. అయితే అన్ని కోతులూ ఒకటి కావు కద. స్వామీజీ కోతిని గురించి తక్కువ చేసి ఎక్కువగా మాటాడడ్డం ఈ యొక్క ఒక్క కోతికి అస్సలు నచ్చేది కాదు. ఏ రోజయినా స్వామీజీ మనస్సుకీ కోతికీ లింకూలంకే పెట్టకుండా మరో సంగతి చెప్తాడా అని చాలా రోజులు వెయిట్ చేసింది కానీ లాభం లేదు. స్వామీజీ మనస్సునీ వదల్లేదు కోతినీ వదల్లేదు.
కోపం వచ్చిన కోతి పిచ్చి కోపం వచ్చిన కోతి సంగతేమిటో తేల్చేయాలనుకుంది. ఒక రోజున ఆశ్రమంలో స్వామీజీ వంటరిగా కనపడ్డాడు. జనం లేరు కదా తన సేఫ్టీకి ఢోకా లేదు కదా అనుకుని స్వామీజీ ముందుకి ఒక్క గెంతు గెంతింది. ఉలిక్కిపడ్డ స్వామీజీ.. ‘కోతీ! ఏమిటీ జబర్దస్తీ తనం ఇది మనుషులు రాతగ్గ స్థలం కానీ కోతులు రావడానికి వీల్లేని ప్లేస్' అన్నాడు చెరగని చిరునవ్వుతో.

‘అలాగా స్వామీ! అలాగే స్వామీ! మరి కోతులు రాకూడదంటున్న మీరే వచ్చీపోయే జనాలకి కోతి గురించి ఎందుకు చెప్తారు. మా జోలికి మీరొచ్చారా? మీజోలికి నేనొచ్చానా?' అని నిలబడి నిక్కచ్చిగా అడిగేసింది కోతి.
కోతి కోతి భాషలో కాక తెలుగులో మాట్లాడ్తున్నది గనక జబాబిస్తే పోయేదేం లేదే అనుకున్నాడు స్వామీజీ.
‘అవును. చెప్తాను. ఎందుకు చెప్పను? మనిషి మనస్సుని కోతితో తప్ప దేంతోనూ పోల్చలేం. మనిషి బుద్ధి కూడా కోతి బుద్ధే. మనస్సుని నియంత్రించి జపతపాలు చేయాలంటే కోతి బుద్ధి దాన్ని చెడగొడ్తుంది' అన్నాడు స్వామీజీ అదే చెరగని చిరునవ్వుతో.
‘జపతపాలు చేయడం మనస్సుని నియంత్రించడం మనుషులే చెయ్యాలా కోతులు చేయలేవా?' అన్నది కోతి.
‘అవును. చేయలేవు. అందేకే కదా కోతి బుద్ధి అనేది మనిషి చెరుపుకే కదా వుండేది' అన్నాడు స్వామీజీ.
‘అయితే మీరు చేసే ఆ జపమో తపమో నేనూ చేస్తాను. నాలాంటి ఓ కోతే మనస్సుని నియంత్రించినప్పుడు ఇహ మనిషి మనస్సునీ బుద్ధినీ కోతితో పోల్చే అవసరం వుండదు' అన్నది కోతి ఓ నిశ్చయానికివొచ్చి.
‘నువ్వు తపం చేస్తావా?' అన్నాడు స్వామీజీ నవ్వుని చెరగనీకుండా.
‘అంతుచూడాలని వుంది. జపమేదో తపమేదో!'
‘అయితే నదిలో స్నానం చేసిరా' అన్నాడు స్వామీజీ.
స్వామీజీ ముందు పద్మాసనం వేసుక్కూచుంది కోతి. కళ్లు మూసుకుని ధ్యానం చేయసాగింది స్వామీజీ చెప్పినట్టే.
కాస్సేపు కూడా కాలేదు. ఆ పక్కనే వున్న వెదుటి బుట్టలో ముగ్గిన అరటి పండు వాసన కోతి ముక్కు పుటాల్ని బద్దలు కొట్టింది. మూసుకుని వున్న కోతి కండ్లు ఆటోమేటిగ్గా తెర్చుకున్నవి. స్వామీజీ ధ్యానంలో వున్నాడు. తనని గమనించలేడు కదా అని అనుకుంది. పండు తినను గాక తినను మాటంటే మాటే ధ్యానమంటే ధ్యానమే వూరికే అలా చేత్తో పట్టి చూస్తే తప్పేమిటి అనుకుంటూ అసింటా అసింటా జరిగి పండును దగ్గర్నించి గుడ్లు మిటకరిస్తూ చూసింది. పండుని చేత్తో పట్టుకున్నంత మాత్రాన ములిగిపోయేదేముంది లెస్తూ అనుకుని పండుని చేత్తో పట్టుకుంది. స్వామీజీ వైపు చూసింది. ఆయన ఈ లోకంలో వుంటే గదా. ఆయన వైపూ పండువైపూ పదే పదే అదే పనిగా చూసింది. కోతినైన తనకు ఈ తపాలూ జపాలూ అవసరమా? అనుకుంది. తపం సంగతి తర్వాత ముక్కూ కళ్లూ కడుపూ సంగతి ముందట అనుకుంది. అంతే గుటుక్కున అరటి పండును మింగేసింది.
మాటలొచ్చకదాని స్వామీజీని ఎన్నెన్ని మాటలనేశాను. నిజంగానే మనిషి మనస్సుకీ నా బుద్ధికీ పోలిక వుంది అనుకుంది బుద్ధిలేని, బుద్ధిరాని కోతి.
మనిషి మనస్సుకీ కోతి గంతలకీ సంబంధం వున్నది కనకే మనకు నిజమైన స్వామీజీల కొరత వున్నది.
-చింతపట్ల సుదర్శన్
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications